కరోనా : భారత్ కి 'మే' పరీక్ష ... నిపుణుల హెచ్చరికలు !

Update: 2020-05-01 06:00 GMT
దేశం లో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నప్పటికీ రెట్టింపయ్యే వ్యవధి మాత్రం తగ్గుతూ రావడం శుభపరిణామం. కరోనా కట్టడి కోసం ఇప్పటి దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ను మే 3 వరకు పొడిగించిన  విషయం తెలిసిందే. అయితే, మే 3 తర్వాత పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అందరిలో  ఉత్కంఠగా మారింది. మే 3 తర్వాత కూడా కరోనా వ్యాప్తి కట్టడి కోసం తీసుకునే చర్యలే ఇప్పుడు చాలా కీలకంగా మారనున్నాయి. మే నెలలో కరోనా కేసులు మరింతగా తగ్గితే ఇక మనదేశం నుంచి ఆ మహమ్మారిని తరిమే అవకాశాలు ఎక్కువగా ఉండనున్నాయి.

అలా కరోనా కంట్రోల్ లోకి రాకపోతే , కరోనా వ్యాప్తి మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చేది వర్షా కాలం కావడంతో మే నెల ఇప్పుడు కరోనా వ్యాప్తికి, కట్టడికి కీలకంగా మారనుంది. కాగా, కరోనా హాట్‌స్పాట్స్, రెడ్ జోన్లలో లాక్ ‌డౌన్ నిబంధనలను కొనసాగిస్తూ గ్రీన్ జోన్లలో సడలింపులను ఇవ్వాలని ఇప్పటికే కేంద్రం ప్రాథమికంగా సూచనలు చేసిన విషయం తెలిసిందే. అయితే, రైళ్లు, విమానాలు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను ప్రారంభించవద్దని, మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులు, మత సంబంధ స్థలాలు, ఇతర జన సమూహాలు చేరుకునే ప్రాంతాలను మే నెల మొత్తం మూసివేసే ఉంచాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకుంటూ కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలని ఈ సమావేశంలో ముఖ్యమంత్రులకు , ప్రధాని మోడీ  స్పష్టం చేశారు. మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగే అవకాశాలున్నట్లు సంకేతాలు ఇచ్చిన కేంద్రం.. కరోనా రహిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో మాత్రం సడలింపులను అనుమతిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. నోయిడా పల్మనాలజీ అండ్ క్రిటికల్ కేర్, ఫర్టీస్ అడిషనల్ డైరెక్టర్ డా. రాజేష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. లాక్‌ డౌన్ కరోనా అంతం చేయకపోయినప్పుడు వ్యాప్తిని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.

కరోనా రెడ్ జోన్లలో లాక్ డౌన్ మరో రెండు వారాలు లేదా అంతకంటే ఎక్కువ రోజులు కొనసాగిస్తే మంచి ఫలితాలు ఆశించవచ్చని గుప్తా చెప్పారు. అయితే, గ్రీన్ జోన్ల మాత్రం సడలింపులు ఇవ్వవచ్చని తెలిపారు. అయితే, రెడ్ జోన్, గ్రీన్ జోన్ల మధ్య ఎలాంటి రాక పోకలు ఉండకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి లేదా తగ్గడానికి మే నెల చాలా కీలకమని డాక్టర్ రాజేష్ కుమార్ గుప్తా తెలిపారు. వచ్చేది వర్షాకాలం కావడంతో కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని, అందుకే మే నెలలో కూడా లాక్ డౌన్ కొనసాగించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.
Tags:    

Similar News