కేసులు పెరుగుతున్నా.. కోలుకుంటున్న బ్రిటీష్ రాజ్యం!

Update: 2020-05-01 08:30 GMT
క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి చేసేందుకు అన్ని దేశాలు దాదాపు లాక్‌ డౌన్‌ ను అస్త్రంగా చేసుకున్నాయి. క‌‌రోనా నుంచి త‌మ ప్ర‌జ‌ల‌ను కాపాడుకోవ‌డానికి నిర్బంధం విధించారు. ఇప్పుడు ఆ నిర్బంధం స‌త్ఫ‌లితాల‌ను ఇస్తోంది. ఆస్ట్రేలియా - చైనా త‌దిత‌ర దేశాల‌తో పాటు భార‌త్‌ లోనూ లాక్‌ డౌన్ వ‌ల‌న ఫ‌లితాలు ఆశాజ‌న‌కంగా ఉన్నాయి. ఈ లాక్‌ డౌన్ వ‌ల‌న తాజాగా మ‌రో దేశం సుర‌క్షితంగా బ‌య‌ట‌ ప‌డుతోంది. క‌రోనా వ్యాప్తి నుంచి తేరుకుని ఇప్పుడిప్పుడే సాధార‌ణ ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. అదే బ్రిట‌న్‌లో (యునైటెడ్ కింగ్‌ డ‌మ్‌-యూకే). క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డి తీవ్రంగా ప్ర‌భావిత‌మైన దేశాల్లో బ్రిట‌న్ ఒక‌టి. ఈ దేశంలో ప్ర‌ధాన‌మంత్రి - మంత్రులు - రాజ కుటుంబానికి చెందిన వారు కూడా క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ఎట్ట‌కేల‌కు ఆ దేశంలో తీసుకుంటున్న చ‌ర్య‌ల‌తో ప్ర‌స్తుతం కోలుకుంటోంది.  ఆ దేశంలో ఇప్ప‌టి వ‌రకు ల‌క్షా డెబ్బై వేల‌కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 26 వేల మందికి పైగా మ‌ర‌ణించారు.

తాజాగా ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణిగాయ‌ని ఏప్రిల్ 30వ తేదీన ఆ దేశం ప్ర‌క‌టించింది. కొత్త‌గా 6 వేల క‌రోనా కేసులు న‌మోదైన నేప‌థ్యంలో తాజాగా లాక్‌ డౌన్‌ ను పొడిగించింది. అయితే క‌రోనా తీవ్ర‌త‌ను తమ దేశం దాటేసింద‌ని యూకే ప్ర‌ధాన‌మంత్రి బోరిస్ జాన్స‌న్ ప్ర‌క‌టించారు. గ‌తంలో ఆయ‌న క‌రోనా బారిన ప‌డి కోలుకున్న విష‌యం తెలిసిందే. కోలుకున్న అనంత‌రం దేశ పాల‌న‌పై దృష్టి పెట్టారు. ముఖ్యంగా క‌రోనా క‌ట్ట‌డిపై చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. వ‌చ్చేవారం నుంచి లాక్‌ డౌన్ నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాల‌నే అంశం గురించి కార్యాచ‌ర‌ణ చేప‌డుతున్న‌ట్లు ప్ర‌ధాని ప్ర‌క‌టించారు.

లాక్‌ డౌన్ నుంచి బ‌య‌టప‌డి సాధార‌ణ జీవ‌న విధానం నెల‌కొనేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ఇప్ప‌టికే ప‌లు యూరోపియ‌న్ దేశాలు క‌రోనాను లాక్‌ డౌన్‌ తో కాకుండా సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొనేలా నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యాయి. ఆ జాబితాలో ఇప్పుడు బ్రిటన్ కూడా చేరుతున్న‌ట్టుగా ఉంది.
Tags:    

Similar News