పాక్ లో మొదలైన కరోనా భయం ..ఒక్కరోజులోనే !

Update: 2020-03-17 19:30 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తో ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 162 దేశాలలో 1,82,609 కేసులు నమోదు కాగా..7171 మంది మరణించారు. చైనాలో అత్యధికంగా 80 వేలకి పైగా కరోనా కేసులు నమోదు కాగా, అందులో 3226 మంది మరణించారు. యూరప్ దేశాల్లో ఈ వైరస్ మరణ మృదంగాన్ని మోగిస్తోంది. ఇటలీలోఇప్పటికే రెండు వేల మందికి పైగా చనిపోయారు. ఇక మన దేశంలో కూడా ఇది ప్రభలుతోంది. ఇప్పటికే కరోనా బారినపడి ఇద్దరు వ్యక్తులు మరణించగా.. 114 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇకపోతే ఈ కరోనా వైరస్ ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన చైనా దేశంలో కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ ఇతర దేశాలలో మాత్రం చాల వేగంగా విసరిస్తుంది. ఇదిలా ఉంటే మన దాయాది దేశమైన పాకిస్థాన్‌ లో కరోనా ప్రభావం ఒక్కరోజులోనే ఊహించని స్థాయికి పెరిగి పోయింది. ఆదివారం వరకు పాక్‌ లో కరోనా కేసులు కేవలం 50 మాత్రమే. అయితే సోమవారం ఒక్క రోజే 131 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పాకిస్థాన్‌లో మొత్తం 180కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పుడు పాక్ ప్రజల్లో అలజడి , ఆందోళన మొదలయ్యాయి.
Tags:    

Similar News