కరోనా.. కరోనా.. కరోనా ..ప్రస్తుతం ప్రపంచం మొత్తం దీనిపైనే చర్చ. ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా కూడా కరోనా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ కరోనావైరస్ చైనా నుండి ఇండియా కి కూడా చేరుకుంది. ఈ కరోనా భయంతో తెలంగాణలో దాదాపుగా జనజీవనం స్తంభించిపోయింది. ఇంట్లో నుండి బయటకి రావడానికి కూడా ఎవరు దైర్యం చేయడంలేదు. రెండు రోజుల క్రితం మైండ్ స్పేస్ లో కరోనా అనుమానిత కేసు నమోదు కావడంతో ..ఆ దెబ్బకి ఐటీ క్యారిడార్ మొత్తం ఖాళీగా దర్శనమిస్తుంది. ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థ పైనా పడుతోంది. రాష్ట్రంలోనే కాదు.. అంతర్జాతీయంగానూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రపంచ కుబేరులు తమ ఆదాయంలో ఇప్పటికే దాదాపుగా 73 లక్షల కోట్ల సంపదని కోల్పోయారు.
ఇకపోతే ఈ కరోనా ప్రభావం హైదరాబాద్ లో ఎక్కువ గా కనిపిస్తుంది. రోజు రోజుకి హైదరాబాద్ సిటీ లో కరోనా అనుమానిత కేసులు ఎక్కువగా నమోదు కావడంతో నగరవాసుల్లో ఆందోళన మొదలైంది. అయితే , తాజాగా తెలంగాణ ప్రభుత్వం నగరవాసులకు శుభవార్త చెప్పింది. తెలంగాణలో 3-3-2020 నాడు మొత్తం 47 మందికి శాంపిల్స్ సేకరించి... గాంధీ ఆస్పత్రిలో పరిశీలించారు. వారిలో 45 మందికి నెగెటివ్ అని వచ్చింది. అందువల్ల వారికి కరోనా వైరస్ లేదని అర్థమైంది. మరో 2 కేసుల్లో స్పష్టత రాకపోవడంతో... ఆ శాంపిల్స్‌ని పుణెలోని వైరాలజీ ల్యాబ్ కి పంపారు. తాజాగా ఆ ఇద్దరికీ కూడా కరోనా నెగటివ్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో, తెలంగాణ లో కేవలం ఒక్కటి మాత్రమే పాజిటివ్ కేసుగా ఉంది
రాష్ట్రంలో ఒక్క మనిషికి కూడా కరోనా వైరస్ రాలేదన్నారు. దుబాయ్ లో ఎఫెక్ట్ అయిన వచ్చి వ్యక్తికి కరోనా వచ్చిందన్నారు. అతనికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. అతని ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. కరోనా అనుమానితుల పట్ల అతిగా స్పందించ వద్దన్నారు. కరోనా పట్ల ప్రజల్లో అపోహలు కలిగి ఉండ వద్దన్నారు. ప్రభుత్వం విశ్రమించదని, కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని మంత్రి ఈటల ప్రకటించారు. అన్ని బోధనాస్పత్రుల్లో ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తామని, అవి సరి పోకపోతే, 40 వేల డబుల్ ఇళ్లను వినియోగిస్తామని తెలిపారు.