ఇప్పుడు అందరి చూపు మే 3పైనే. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న లాక్ డౌన్ విషయంలో....సడలింపుల సానుకూలత వస్తున్న స్పష్టమైన నిర్ణయం వెలువడే ఆ తేదీపై అందరి చూపు ఉంది. అయితే, తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ పరిస్థితి ఏంటి? కేంద్రం నిర్ణయం కంటే మరో నాలుగు రోజుల ఎక్కువ గడువు తో లాక్ డౌన్ విధించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేయనున్నారు? అనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కేంద్రం బాటలోనే కేసీఆర్ సర్కారు సాగనుందట.
తెలంగాణలోని కరోనా కేసులు, ప్రస్తుత పరిస్థితులను అధ్యయనం చేసిన వారు ఈ మేరకు రాష్ట్ర సర్కారు తీరును అంచనా వేస్తున్నారు. మే 3తో కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్ పూర్తి కానుంది. 4 నుంచి దశల వారీగా లాక్ డౌన్ ఎత్తేసే ఆలోచన ఉంది. గ్రీన్ జోన్లకు వీలైనన్ని ఎక్కువ సడలింపులు ఇవ్వనున్నట్టు సంకేతాలున్నాయి. ఈ మేరకు కేంద్రం ఇచ్చే సడలింపులనే మే 8 నుంచి రాష్ట్రంలోనూ అమలు చేసే చాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారు. తెలంగాణ లో ఇప్పటి వరకు అమలు చేసిన లాక్ డౌన్‌తో కరోనా కేసులు కట్టడి అయ్యాయనే ధీమా రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కేంద్రం సడలింపులు ఇచ్చినా ఇక్కడ కఠినంగా వ్యవహరించడంతో మంచి రిజల్ట్ వచ్చిందని అధికారులు అంటున్నారు. అయితే 7 వారాల లాక్ డౌన్ తో జనం పడుతున్న ఇబ్బందులను సర్కారు పట్టించుకోవడంలేదని, కరోనా కేసులను తక్కువ చేసి చూపిస్తున్నారన్న విమర్శలున్నాయి. దీంతో కేంద్రంతో పాటు ముందుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్టు అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
సమస్యలు ఎదురు కాకుండానే లాక్ డౌన్ తొలగించే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. గత నెలలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కాదని.. మళ్లీ లాక్ డౌన్ పెంచే పరిస్థితులుండవని చెప్తున్నారు. . ఇప్పటివరకు రాష్ట్రం నో చెప్పిన సడలింపులన్నీ మే 8 నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువ అని విశ్లేషిస్తున్నారు. అన్ని రాష్ట్రాలతో పాటే తెలంగాణ రాష్ట్రం కూడా వెళ్లక తప్పదని అంటున్నారు. షాపులు ఓపెన్ చేసినా సోషల్ డిస్టెన్స్ పాటించాల్సి ఉంటుందని, ప్రార్థనా మందిరాలు, జనం గుమిగూడే కార్యక్రమాలకూ అనుమతించక పోవచ్చునని అంటున్నారు.