కరోనా వేళ.. ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పగా చెబుతుంటారు. ఆయన నిర్వహించే ప్రెస్ మీట్ లో ఎవరైనా కాస్త స్వేచ్ఛ తీసుకొని ప్రశ్న వేస్తే.. ఆ రిపోర్టర్ ముఖం పగిలేలా సమాధానం ఇవ్వటంతో పాటు.. ఏకి పారేస్తుంటారు. తనకు మెచ్చిన.. తనకు సులువుగా ఉండే ప్రశ్నల్ని మాత్రమే వేయాలన్న విషయాన్ని తరచూ తన తీరుతో చెప్పేస్తుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కరోనా వేళ.. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పే ఉదంతం తాజాగా చోటు చేసుకుంది.
విన్నంతనే అయ్యో అనుకునేలా ఉన్న ఈ వ్యవహారాన్ని చూస్తే.. అధికారయంత్రాంగం పని తీరు మీద కొత్త సందేహాలు కలగటం కాయం. బీదర్ కు చెందిన 45 ఏళ్ల గోవింద్ ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తుంటాడు. అతడికి భార్య పూజ.. ఇద్దరు కుమార్తెలు.. ఏడాదిన్నర వయసున్న కొడుకు ఉన్నాడు. హైదరాబాద్ లోని బోడుప్పల్ కాలనీలో నివాసం ఉండే అతడు ఏప్రిల్ రెండోవారంలో అనారోగ్యానికి గురయ్యాడు. జలుబు.. ఆయాసంతో బాధ పడుతున్న అతడ్ని స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అతడ్ని ఏప్రిల్ 24న అంబులెన్సులో కింగ్ కోఠి ఆసుపత్రికి తరలించారు.
అక్కడ పరీక్షలు జరిపిన వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని తేల్చారు. అతడ్ని చెస్ట్ ఆసుపత్రికి వెళ్లాలని చెప్పారు. రవాణా సౌకర్యం లేని నేపథ్యంలో ఆసుపత్రి పరిసరాల్లోనే ఉన్న అతడు.. అక్కడే ఉండిపోయాడు. చివరకు నడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఏమైందో ఏమో కానీ.. గురువారం రాత్రి బొగ్గులకుంట చౌరస్తాలో రోడ్డు మీద పడిపోయాడు. అక్కడి వారు అందించిన సమాచారంతో నారాయణగూడ పోలీసులు గోవింద్ పడిపోయిన ప్రాంతానికి చేరుకున్నారు. అతడ్ని పరీక్షించగా అప్పటికే అతను మరణించిన వైనాన్ని గుర్తించారు.
అతడి దగ్గర ఉన్న కాగితాల్ని చూసినప్పుడు.. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్లుగా స్లిప్పులు ఉన్నాయి. దీంతో.. కుటుంబ సభ్యులకు సమాచారాన్ని ఇచ్చారు. అంబులెన్సులో ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి.. నాలుగు రోజుల వ్యవధిలో రోడ్డు మీద దిక్కులేని రీతిలో మరణించిన తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇక.. గోవింద్ కుటుంబ సభ్యుల విషాదానికి అంతు లేకుండా పోయింది. తన భర్త గురించి అధికారుల్ని వాకబు చేస్తే.. కింగ్ కోఠి ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నట్లుగా చెప్పారని.. గురువారం ఉదయం కూడా ఇదే విషయాన్ని చెప్పారని పూజ చెబుతోంది. మరి.. రోడ్డు మీద అనాధలా మరణించిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా ఈ ఉదంతాన్ని చెబుతున్నారు. మరీ.. అంశంపై రానున్న ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను క్వశ్చన్ అడిగితే ఆయన ఎలా స్పందిస్తారో? గతంలోనూ నేపాల్ కు చెందిన మరో వ్యక్తి (బహదూర్) కూడా ఇదే రీతిలో హైదరాబాద్ లో మరణించిన వైనాన్ని పలువురు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అప్పట్లో కూడా కింగ్ కోఠి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి మరణించటం గమనార్హం.