చైనాలో పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ తెలంగాణకు వచ్చేసింది. సికింద్రాబాద్ లోని మహేంద్రహిల్స్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇప్పుడు అతడితో సన్నిహితంగా ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, పరీక్షించిన వైద్య సిబ్బంది మొత్తం 80మంది హడలి చస్తున్నారు. సికింద్రాబాద్ లో అతడు తిరిగిన ప్రదేశాలు, మహేంద్రహిల్స్ అంతా భీతావాహ పరిస్థితి నెలకొంది.
మహేంద్రహిల్స్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ (24) కంపెనీ పనిమీద దుబాయ్ వెళ్లాడు. అక్కడ చైనా హాంకాంగ్ కు చెందిన తోటి సాఫ్ట్ వేర్ ఇంజినీర్లతో కలిసి పనిచేశాడు. ఫిబ్రవరి 20న బెంగళూరు వచ్చాడు. 22న బస్సులో హైదరాబాద్ వచ్చాడు. .
అయితే వైరస్ సోకిన లక్షణాలు, జ్వరం రావడంతో మొదట ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించుకున్నాడు. తగ్గకపోవడంతో సికింద్రాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. ఎంతకీ జ్వరం తగ్గకపోవడం.. కరోనా లక్షణాలు ఉండడంతో అనుమానం వచ్చిన ప్రైవేటు వైద్యులు గాంధీ ఆస్పత్రికి పంపారు. వారు రక్తనమూనాలు సేకరించి పుణెలోని జాతీయ వైరాలజీ ల్యాబ్ కు పంపారు. అక్కడ పరీక్షల్లో కరోనా వైరస్ అని తేలింది. కేంద్రం అధికారికంగా ఈ విషయాన్ని తెలిపింది.
దీంతో ఇప్పుడా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దుబాయ్ నుంచి బెంగళూరు, హైదరాబాద్, అతడి ఇంటికి, ఆస్పత్రికి చాలా చోట్ల తిరిగిన ప్రదేశాలు, కలిసిన మనుషులపై ప్రభుత్వం ఆరాతీస్తోంది. అంటు వ్యాధి కావడంతో వారందరికీ కరోనా సోకడం గ్యారెంటీ. దాదాపు 80మందితో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తో ఇప్పటివరకూ కలివిడిగా ఉన్నట్టు తేలింది. ఇప్పుడు వారందరికీ కరోనా సోకడం ఖాయమని కనిపిస్తోంది.
సికింద్రాబాద్ లోని మహేంద్ర హిల్స్ లో ఇప్పుడు ఒక్క పురుగు లేకుండా అంతా ఖాళీ చేశారు. ఆ గల్లీ యువకుడికి కరోనా సోకడంతో మొత్తం కాలనీ నిర్మానుష్యంగా మారింది. ఆ ప్రాంత వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. యువకుడి వల్ల ఎంతమందికి కరోనా సోకిందనేది తెలియరావడం లేదు. దాదాపు అతడికి సన్నిహితంగా 80మందికి సోకడం ఖాయమంటున్నారు. ఇందులో ఇతడికి చికిత్స చేసి వైద్యసిబ్బంది కూడా ఉన్నారట.. సో హైదరాబాద్ లో కరోనా వ్యాపించడానికి ఈ యువకుడు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాడు.చైనా మహమ్మారి వెలుగుచూడడంతో హైదరాబాద్ లో భయాందోళనకర వాతావరణం కనిపిస్తోంది.