కరోనా మరో టెన్షన్.. ఐదు నెలలైనా ఒంట్లోనే వైరస్.. వారికి చాలా రిస్క్!

Update: 2021-01-20 00:30 GMT
కరోనాకు వ్యాక్సిన్ వచ్చేసింది.. ప్రపంచం మొత్తం ‘హమ్మయ్యా’ అని ఊపిరి పీల్చుకుంటోంది. కానీ.. లేటెస్ట్ గా బయటకు వచ్చిన కొన్ని గణాంకాలు మళ్లీ ఆందోళన రేకెత్తిస్తున్నాయి. కొవిడ్ నుంచి రికవరీ అయిన 140 రోజుల్లో అనారోగ్యంతో ఆస్పత్రి పాలై మరణిస్తున్నారు చాలా మంది. వైరస్ బారిన పడి కోలుకున్న తర్వాత ఐదు నెలల్లోనే మళ్లీ కరోనాతో ఆస్పత్రి పాలవుతున్నారంట! ఇలా మరణిస్తున్న వారు ప్రతీ ఎనిమిది మందిలో ఒకరు ఉంటున్నారని లెక్కలు చెబుతున్నాయి.

యూనివర్శిటీ ఆఫ్ లిచెస్టర్, ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటాస్టిక్స్ (ఓణ్శ్)కు చెందిన బాంబ్ సేల్ రీసెర్చ్ అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసింది. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన బాధితుల్లో 29.4శాతం మంది ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలతో మళ్లీ ఆస్పత్రుల్లో చేరుతున్నారని ఈ సంస్థ పరిశోధనలో తేలింది. వీరిలో దాదాపు 12.3 శాతం మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక మరణించారు.

అంటే.. డిశ్చార్ అయిన తర్వాత కూడా వైరస్ ప్రభావం దీర్ఘకాలం శరీరంలో ఉంటోందన్న విషయం దీంతో స్పష్టమైందని చెబుతున్నారు వైద్యులు. అందుకే బాధితులను ఎక్కువ రోజులు మానిటర్ చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

అయితే.. ఇలా చనిపోతున్న వారిలో ప్రధానంగా.. గుండె, డయాబెటిస్, దీర్ఘకాలిక కాలేయం, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారే ఎక్కువగా ఉన్నారని వైద్యలు తేల్చారు. ఈ సమస్యల కారణంగానే బాధితులు మరణిస్తున్నారని సైంటిస్టులు తమ రీసెర్చ్‌లో గుర్తించారు.

కరోనా నుంచి కోలుకున్న బాధితుల్లో దాదాపు 30శాతం మంది మళ్లీ ఆస్పత్రుల్లో చేరుతున్నారని ప్రొఫెసర్ కమలేశ్ ఖౌంటీ వెల్లడించారు. దీర్ఘకాలిక కోవిడ్ సమస్యల కోసం వైద్యసేవలు అందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ అధ్యయనంలో భాగంగా 47,780 మంది డిశ్చార్జ్ అయిన కరోనా బాధితుల వివరాలు సేకరించి పరిశోధన చేసినట్లు చెప్పారు. దీనిపై ఇంకా పూర్తి రివ్యూ చేయలేదని, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.
Tags:    

Similar News