ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఆ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 30 లక్షలపైనే ఉంది. మొత్తం 2 లక్షల మంది మృత్యువాత చెందగా దాదాపు 20 లక్షల మంది ఇప్పుడు కరోనాతో బాధ పడుతూ ఆస్పత్రుల్లో ఉన్నారు. అయితే వీరిలో దాదాపు 10 లక్షల మంది కోలుకున్నారు. అంటే మొత్తం కేసుల్లో దాదాపు మూడో వంతు మంది ఆరోగ్యవంతులయ్యారు.
కరోనా వైరస్ కు సంబంధించిన లెక్కలు వరల్డో మీటర్ వెల్లడించింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న 20 లక్షల మందిలో కొద్దిపాటి లక్షణాలున్నవారు 19.45 లక్షల మంది, వారిలో పరిస్థితి విషమంగా ఉన్నవారు కేవలం 54 వేలు అని ఆ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు భవిష్యత్‌లో ఆరోగ్యంతో బయటడతారని ఆ లెక్కలు వెల్లడిస్తున్నాయి. కరోనా వైరస్ తో బాధ పడుతున్న వారికి హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్, జింక్ వంటి ఔషధాలతో చికిత్స అందిస్తున్నారు. ఆ మందులకు కరోనా నుంచి కోలుకుంటున్నారు. మరికొందరికి ప్లాస్మా థెరపీ వంటి కొత్త తరహాలో వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అందిస్తున్న వైద్యం అద్భుతంగా పని చేస్తూ బాధితుల ఆరోగ్యం మెరుగవుతోంది. కేవలం దీర్ఘకాలిక వ్యాధులు, వృద్ధాప్యంతో బాధ పడుతున్న వారి పరిస్థితే విషమించి మృత్యు వాతకు గురవుతున్నారు. 30 లక్షల మందిలో మృతుల సంఖ్య 2.28 లక్షలు. ఆ మొత్తం మృతుల శాతం 7గా ఉంది.
భారతదేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఆశాజనకంగా ఉంది. గురువారం వరకు 25.19 శాతంగా ఉందని కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. అయితే మరణాలు 3.2 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం 33,610 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 8,373 మంది వైద్యం పొంది కోలుకోగా వారి శాతం 24.91గా ఉంది. మరణించిన వారు 1,075 మంది ఉండగా మొత్తం కేసుల్లో మరణాల రేటు 3.19 శాతంగా ఉంది. వీరిలో మృతుల్లో 65 శాతం పురుషులు ఉండగా, 35 శాతం స్త్రీలు ఉన్నారు.