ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇటు భారతదేశ ప్రజలని కూడా భయాందోళనలకు గురి చేస్తోంది. భారతదేశంలో మూడో వైరస్ కేసు నమోదైంది. ఇది కూడా కేరళలోనే నమోదు కావడం గమనార్హం. ఇప్పటికే కేరళలో ముగ్గురు కరోనా వైరస్ కు గురై చికిత్స పొందుతున్నారు. దీంతో కేరళలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య మూడుకు చేరుకుంది. ఆ విషయాన్ని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ కూడా ధ్రువీకరించారు. కేరళలోని కాసర్ గోడ్ జిల్లాలో తాజా కేసు నమోదైంది. మూడో రోగి కూడా చైనా నుంచే తిరిగి వచ్చినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం బాధితుడిని ప్రత్యేకంగా ఓ వార్డులో పెట్టి చికిత్స అందిస్తునట్టు సమాచారం. ఇప్పటిదాకా మొత్తం 104 రక్తనమూనాలను తాము పుణేలోని వైరాలజీ ఆసుపత్రికి పంపించామని, వాటి నివేదికలు ఇంకా అందాల్సి ఉందని డాక్టర్లు తెలిపారు. చైనా నుంచి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన వారి కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని అన్నారు. స్థానిక అధికారులకు గానీ, వైద్య శిబిరాన్ని పర్యవేక్షిస్తున్న సిబ్బందికి గానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్కడ వైద్య పరీక్షలను పొందుతున్న వారెవ్వరూ స్వస్థలాలకు వెళ్లకుండా నిషేధించామని అన్నారు. రక్త నమూనాల పరీక్షలు నెగెటివ్ గా తేలిన తరువాతే.. వారికి ఇళ్లకు పంపిస్తామని చెప్పారు.
కాగా, కరోనా వైరస్ మృతుల సంఖ్య 305కు చేరింది. చైనాలో 304 మంది చనిపోగా.. చైనా బయట తొలి కరోనా మృతి ఫిలిప్పీన్స్‌లో నమోదైంది. ఆ దేశ రాజధాని మనీలాలో నివసిస్తున్న ఓ చైనీయుడు వైరస్ బారిన పడి మరణించాడు. ఇక చైనాలో ఈ వైర్‌సతో బాధ పడుతున్న వారి సంఖ్య 14వేల 380కి చేరుకుందని ఆ దేశ హెల్త్ కమిషన్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ వైరస్ భారత్, అమెరికా, యూకేతో పాటు మొత్తం 25 దేశాలకు విస్తరించినట్టు అంచనా వేస్తున్నారు.