తెలంగాణలో రెడ్ - బఫర్ జోన్లు ఉండవిక..!

Update: 2020-04-10 11:50 GMT
తెలంగాణ కరోనా వైరస్ విస్తృతి ఎక్కువగా ఉంది. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో తీవ్రత బాగా పెరుగుతోంది. కరోనా పాజిటివ్ వచ్చిన వారి ఇంటిని, కాలనీని గుర్తించి రెడ్ - బఫర్ జోన్లు - హాట్ స్పాట్లు అంటూ విభజిస్తూ అక్కడ పూర్తి దిగ్బంధాన్ని విధిస్తున్నారు. దీంతో ఇలా పేర్లు పెడితే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

దీంతో తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ రెడ్  - బఫర్ - హాట్ స్పాట్ల పేర్లను మార్చుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా హైదరాబాద్ లోని 12 ప్రాంతాలను కంటైన్ మెంట్ జోన్లుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీటికి కొత్త పేరుగా 'కంటైన్ మెంట్లు' అని పేరు పెట్టారు.

ప్రస్తుతం హైదరాబాద్ లోని ఈ 12 ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత అధికంగా ఉంది. మర్కజ్ వెళ్లిన 603మంది లో వంద మందికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది.

దీంతో ఏకంగా హైదరాబాద్ లోని 30 కాలనీల్లో వేలాది కుటుంబాలను అధికారులు దిగ్బంధించి ఇంటింట సర్వే చేస్తున్నారు. వారి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని పరీక్షలకు పంపుతున్నారు. కాలనీల నుంచి లోపలికి బయటకు ఎవరూ రాకుండా చర్యలు చేపడుతున్నారు.
Tags:    

Similar News