వైరల్ ఫోటో...కరోనా ఎంత పని చేసిందంటే?

Update: 2020-04-30 00:30 GMT
కరోనా మహమ్మారి దేశంలో రోజు రోజుకి మరింత వేగంగా విజృంభిస్తూ ప్రజలని భయబ్రాంతులకు గురిచేస్తుంది.  దేశంలో మొదట్లో కరోనా భాదితులు తక్కువగానే ఉన్నప్పటికీ కూడా ..ఢిల్లీ మర్కజ్ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక తెలంగాణ లో కూడా కరోనా భాదితుల సంఖ్య వెయ్యి దాటింది. అయితే , తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కట్టుదిట్టమైన చర్యల వల్ల రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తుంది.

అయితే , కరోనా ను కట్టడి చేయడానికి మరో మార్గం లేక లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. అయితే , ఈ లాక్ డౌన్ వల్ల అనేకమంది జీవితాలు రోడ్డున పడుతున్నాయి. తినడానికి తిండి కూడా లేని వారు చాలామంది ఉన్నారు ..వారి రోజు దినసరి కూలి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే , ఈ లాక్ డౌన్ వల్ల వారికీ పనులు లేకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు. రాష్ట్రంలో ఆకలి తో ఎలా బాధపడుతున్నారో తెలియజేసే సంఘటన ఒకటి హైదరాబాద్ - కూకట్ పల్లి లో చోటు చేసుకుంది.

మంగళవారం కూకట్‌ పల్లిలోని ఎల్లమ్మ బండ వద్ద గౌరవప్రదంగా జీవనం సాగించే ఓ పురోహితుడు వాహనదారులను యాచించడంతో అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. కరుణ లేని కరోనా వికృత రూపం జనజీవితాలను దయనీయ స్థితికి ఎలా దిగజార్చిందో ఈ దృశ్యమే తార్కాణం. విధి కన్నెర్ర జేస్తే ఎంతటి వారైనా కూడా రోడ్డున పడాల్సిందే బతుకు బాటలో కష్టాలు - కన్నీళ్లూ తప్పవని రుజువు గా నిలుస్తోంది.
Tags:    

Similar News