విమాన, రైల్వే ప్రయాణాలకు రంగం సిద్ధం

Update: 2020-05-02 06:45 GMT
కరోనా వైరస్ తో విధించిన లాక్ డౌన్ వల్ల సర్వం బంద్ అయిపోయాయి. ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోయింది. మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా రైళ్లు, విమానాలు నిలిచిపోయాయి.  మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయనే దానిపై అందరిలోనూ అనుమానాలున్నాయి.

తాజాగా విమానయాన, రైల్వే అధికారులు ఈ మేరకు చూచాయగా క్లారిటీ ఇచ్చారు. మే నెలలోనే విమానాలు, రైల్వేల రాకపోకలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. విమానాలను మే నెల రెండో వారంలో ప్రారంభించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని తెలిపారు. రైళ్లను కూడా రెండో వారంలో కానీ.. మూడో వారంలో కానీ ప్రారంభించే అవకాశాలున్నాయని తెలిపారు. అయితే వీటిలో ప్రయాణాలు మాత్రం ఇదివరకులా ఉండవని.. చాలా గ్యాప్ తో ప్రయాణికులను కూర్చుండబెట్టి ప్రయాణాలు సాగుతాయని ఉన్నతాధికారులు తెలిపారు.

విమాన ప్రయాణాల రాకపోకలు తొలుత దేశ రాజధాని ఢిల్లీ నుంచి అన్ని మెట్రో సిటీలు, ఆయా రాష్ట్రాల రాజధాని నగరాల మధ్య ప్రారంభిస్తారని ఆ అధికారులు తెలిపారు.  ఆ తర్వాత ప్రధాన నగరాలు, పట్టణాలకు నడుస్తాయి. 30శాతం సర్వీసులు మాత్రమే ఇలా నడిపిస్తారు. సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత ప్రమానాలు పాటించడం ప్రయాణికులు, సిబ్బందికి తప్పనిసరి చేసింది. విమానాశ్రయాల్లో టీ, కాఫీ మాత్రమే లభిస్తుంది. బార్లు, ఇతర షాపింగ్ దుకాణాలను మూసివేస్తారు. ఇక ప్రతీ ప్రయాణికుడు తాను ఆరోగ్యంగా ఉన్నానని.. తనకు కరోనా లేదని ధ్రువీకరించి సంతకం చేయాలి.మోసం చేసినట్టు తేలితే కేసులు నమోదు చేస్తారు.

 మే 15వ తేదీనుంచి దేశీయ విమాన ప్రయాణాలు ప్రారంభం అవుతాయి.  జూన్ 1వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ప్రారంభమవుతాయి.

*ఇక రైల్వేలోనూ అంతే..
విమానాశ్రయాల్లో పాటిస్తున్న నిబంధనల వలే రైల్వే స్టేషన్ లో కూడా సామాజికదూరం, వ్యక్తిగత శుభ్రత ప్రమాణాలు పాటించనున్నారు. ఇప్పటికే దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో మార్కింగ్ వేశారు. మొదట కేవలం స్లీపర్ కోచ్ లు మాత్రమే నడపాలని.. ఏసీ కోచ్ లను నడపకూడదని అధికారులు వెల్లడించారు. ప్రతీ కంపార్ట్ మెంట్ లో 8మంది ప్రయాణికులకు బదులు 3-5మందిని మాత్రమే అనుమతించాలని రైల్వే అధికారులు  నిర్ణయించారట.. బెర్తుల సంఖ్యను కుదించారు.
Tags:    

Similar News