స్క్రీనింగ్‌ కు దొరక్కుండా పారాసిటమాల్ మింగుతున్నారు..ఎందుకంటే?

Update: 2020-03-18 15:30 GMT
కోరనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వాలు థర్మల్ స్క్రీనింగ్‌ ను ఏర్పాటు చేశాయి. ఐతే విదేశాల నుండి వస్తున్న వారు విమానం దిగిన తర్వాత థర్మల్ స్క్రీనింగ్‌ కు దొరక్కుండా ఉండేందుకు జ్వరానికి ఉపయోగించే పారాసిటమాల్ టాబ్లెట్స్ వేసుకుంటున్నారట. విమానం దిగడానికి ఓ గంట ముందు ఈ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు. తద్వారా శరీర ఉష్ణోగ్రతలు తగ్గి స్క్రీనింగ్‌ లో దొరక్కుండా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉష్ణోగ్రతలు ఉన్న వారిని సీ కేటగిరీ కింద భావించి నేరుగా ఇళ్లకు పంపిస్తారు. ఇంటి వద్దే ఐజోలేషన్‌ లో ఉండాలని సూచిస్తున్నారు. కాస్త జ్వరంలా ఉంటే ఆసుపత్రికి లేదా క్వారంటైన్ కేంద్రాలకు పంపిస్తారు. ఇక్కడకు వెళ్లకుండా ఉండేందుకు విమానం దిగడానికి గంట ముందు పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఉపయోగిస్తున్నారట. హైదరాబాద్ విమానాశ్రయంలో దిగేవారు కూడా ఇలా చేస్తున్నారు.

ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. ఇటీవల దుబాయ్ నుండి వచ్చిన ఓ వ్యక్తి ఇలా ట్యాబ్లెట్ వేసుకొని థర్మల్ స్క్రీనింగ్‌ కు దొరక్కుండా తప్పించుకున్నాడు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదు అందడంతో వెలుగు చూసింది.
Tags:    

Similar News