దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లోనే దాదాపు 2293 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 37336కు చేరింది.24 గంటల్లో 77మంది మృతిచెందారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య దేశంలో 1223కి చేరింది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 11వేల మంది వైరస్ బారినపడ్డారు. శుక్రవారం ఒక్కరోజే 1008 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ముంబైలోనే 750కి పైగా ఉండడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది.
ఢిల్లీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 223 కేసులు నమోదయ్యాయి. 73మంది కోలుకున్నారు. ఇద్దరు మరణించారు. తాజా కేసులతో ఢిల్లీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3738కి చేరింది.
*ఏపీలో 1500 దాటిన కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1525కి చేరింది. రేపో మాపో ఆ మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఏపీలో ఇప్పటిదాకా కరోనా కారణంగా 33మంది మరణించారు. ఇక 441మంది కోలుకున్నారు.
*తెలంగాణలో 1039కి కేసులు
తెలంగాణలో కరోనా తీవ్రత ఏపీతో పోలిస్తే కాస్త తక్కువగా ఉంది. ఇప్పటిదాకా 1039 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 441మంది కోలుకున్నారు. తెలంగాణలో కరోనా కారణంగా 26మంది మరణించారు.
*ప్రపంచవ్యాప్తంగా..
కరోనా ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. వైరస్ దెబ్బకు అంతా అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 3,358,341 కు చేరింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 237,095 మంది ప్రాణాలు కోల్పోగా..1,067,831 మంది కోలుకున్నారు. అమెరికాలో సగుటను 2వేల చొప్పున మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది.