ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ‌ను విచారించ‌మ‌న్న కోర్టు

Update: 2015-11-03 09:54 GMT
ప్ర‌ముఖ మీడియా సంస్థ అధినేత.. ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణపై దాఖ‌లైన ఫిర్యాదుపై విచార‌ణ జ‌ర‌పాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవిభ‌క్త క‌వ‌ల‌లైన వీణ‌..వాణి వైద్య సాయం కోసం గ‌తంలో ఆంధ్ర‌జ్యోతి విరాళాలు సేక‌రించింది. ఈ మొత్తాన్ని బాధితుల‌కు ఇవ్వ‌కుండా మోసం చేశార‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. దీనికి సంబంధించి ఈ మ‌ధ్య‌నే స‌ద‌రు ప‌త్రిక త‌న వివ‌ర‌ణ ఇచ్చింది.

అయితే.. రాధాకృష్ణ మీద ఉన్న ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరుతూ జ‌నార్ద‌న్ గౌడ్ అనే అడ్వ‌కేట్ ఒక‌రు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై విచారించిన కోర్టు.. ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ మీద విచార‌ణ జ‌ర‌పాల‌ని ఆదేశాలు జారీ చేసింది. పిటీష‌న్ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.

ఈ నెల 16 లోపు నివేదిక అందజేయాల‌ని పోలీసుశాఖ‌ను ఆదేశించింది. అదే స‌మ‌యంలో రాధాకృష్ణ మీద సెక్ష‌న్ 420 - 406 - 120 (బి) కింద కేసు న‌మోదు చేయాల‌ని ఆదేశించింది. మ‌రి.. ఈ వ్య‌వ‌హారం రానున్న రోజుల్లో ఎన్ని మ‌లుపులు తిర‌గ‌నుందో..?
Tags:    

Similar News