బ్రెజిల్ తో కొవాగ్జిన్ కాంట్రాక్టు రద్దు.. అధ్యక్షుడిపైనే అవినీతి ఆరోపణలు
భారతీయ వ్యాక్సిన్ అయిన ‘కొవాగ్జిన్’ను కొనుగోలు చేసేందుకు బ్రెజిల్ దేశం.. భారత్ భయోటెక్ తో కుదుర్చుకున్న ఒప్పందం రద్దు అయ్యింది. 20 కోట్ల డోసుల కొవాగ్జిన్ కోసం.. 324 మిలియన్ డాలర్లు వెచ్చించేందుకు బ్రెజిల్ సిద్ధమైంది. అయితే.. చెల్లింపుల విషయంలో బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో.. ఈ డీల్ అనివార్యంగా రద్దైపోయింది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య మంత్రి మార్సెలో వెల్లడించారు.
ఓ థర్డ్ పార్టీ కంపెనీ పేరుతో తప్పుడు ఇన్ వాయిస్ లు సృష్టించినట్టు ఫెడరల్ దర్యాప్తు సంస్థలు తేల్చినట్టుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఫెడరల్ కంప్ట్రోలర్ జనరల్ హెడ్ వాగ్నర్ రొసారియో మాట్లాడుతూ.. విచారణ కొనసాగుతోందని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ డీల్ ను క్యాన్సిల్ చేసినట్టు తెలిపారు. అధ్యక్షుడు మాత్రం ఇది సరైన పద్ధతి కాదని, తన ప్రభుత్వాన్ని కించపరచడమేనని అంటున్నారు.
కాగా.. ఈ విషయమై భారత్ భయోటెక్ కూడా స్పందించింది. తమ వైపు నుంచి ఎలాంటి తప్పూ జరగలేదని, ప్రతీ నిబంధనను పాటించామని చెప్పింది. ఇప్పటి వరకూ ఆ దేశ ప్రభుత్వం నుంచి తమకు ఒక్క రూపాయి కూడా అందలేదని, అదే సమయంలో తాము కూడా ఒక్క డోసును కూడా సరఫరా చేయలేదని స్పస్టం చేసింది.
బయటి దేశాలన్నింటికీ ఒక డోసు ధరను 15 నుంచి 20 డాలర్లుగా నిర్ణయించామని, బ్రెజిల్ కు సైతం 15 డాలర్లకే వ్యాక్సిన్ సరఫరా చేసేలా ఒప్పందాలు చేసుకున్నట్టు తెలిపింది. ఆ దేశంలో రెగ్యులేటరీ అనుమతల కోసం, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు సైతం ఇప్పటికే దరఖాస్తు చేశామని తెలిపింది. మీడియాలో పలు తప్పుడు కథనాలు వస్తున్నాయని, అందుకే.. ఈ స్పష్టత ఇస్తున్నామని భారత్ భయోటెక్ చెప్పింది. కాగా.. ఈ ఆరోపణలతో బ్రెజిల్ అధ్యక్షుడికి పదవీ గండం పొంచి ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.