ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. అమెరికాలో ఒక్కరోజులోనే నాలుగు లక్షల పైన కొత్త కేసులు నమోదయ్యాయి. ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ లాంటి దేశాల్లో కూడా వైరస్ కేసుల సంఖ్య అమాంతంగా పెరిగింది. ఒక్కరోజులోనే లక్షల్లో కేసులు నమోదు అవుతుండడంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇదిలా ఉంటే కరోనా కొత్త వేరియంట్ కేసులు కూడా భారీగా నిర్ధారణ అవుతున్నాయి. ప్రపంచ దేశాల్లో ఇక్కడ ఉన్న వ్యక్తిని దృష్టిలో ఉంచుకొని డబ్ల్యూహెచ్ఓ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ ఆంక్షలను తప్పనిసరిగా పాటించాలని కోరింది. వివిధ దేశాలలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి చెందిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని సూచించింది. వ్యాక్సిన్ తీసుకున్నా సరే కరోనా వైరస్ నియమాలను తప్పకుండా పాటించాలని కోరింది. ముఖ్యంగా ప్రజల మధ్య భౌతిక దూరం ఉండేలా చూసుకోవాలని సూచించింది.
ఇదిలా ఉంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ప్రజలు చాలా మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయం ప్రపంచదేశాలను ఆందోళనకు గురి చేస్తుంది. అయితే ఇలాంటి ఘటనలు మన దేశంలో చాలానే ఉన్నాయి. కానీ 4 సార్లు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల ఓ మహిళ దుబాయ్ నుంచి మన దేశానికి వచ్చింది. ఆమె సుమారు నాలుగు సార్లు టీకా తీసుకున్నట్లు తెలిపింది. అంటే రెండు రకాల టీకాల రెండు డోసులను వేసుకుంది. కానీ ఆమె కు కరోనా వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ఇది చాలా అరుదైన ఘటనగా పేర్కొన్నారు. ఈమె దుబాయ్ నుంచి భారత్ కు ఇటీవలే వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు లేదా మన దేశం నుంచి వెళ్లే వారికి సాధారణంగా కరోనా పరీక్షను నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఆమెకు పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఎయిర్ పోర్ట్ సిబ్బంది పేర్కొన్నారు.
పాజిటివ్ గా నిర్ధారణ అయిన మహిళకు నాలుగు రోజుల నుంచి జలుబు, దగ్గు ఉన్నట్లు ఆమె తెలిపింది. అయితే వైరస్ కు సంబంధించి తీవ్రమైన లక్షణాలేవి ఆమెలో లేనట్లు అధికారులు పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్త ప్రకారం ఆమెను ఆసుపత్రిలో ఉంచినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఆమె 12 రోజుల క్రితమే మనదేశానికి వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే దుబాయ్ నుంచి ఆమె ఇండోర్ కి వెళ్లినట్లు స్పష్టం చేశారు. అక్కడ నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. అయితే తిరుగు ప్రయాణం గా మళ్లీ తిరిగి దుబాయ్ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో పరీక్షలు నిర్వహించగా ఆమెకు పాజిటివ్ వచ్చిందని స్పష్టం చేశారు. ఈమె 12 రోజులుగా తిరిగినా ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులను అధికారులు అప్రమత్తం చేశారు. వారు వెంటనే కరోనా కు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అయితే ఆ మహిళకు సోకింది కరోనా కొత్త వేరియంట్ నా లేక కరోనా వైరస్ నా అనేది అధికారులు స్పష్టం చేయలేదు.