బీజేపీ ముఖ్యమంత్రులు - ఇతర నాయకులు తమ వ్యాఖ్యలతో అబాసుపాలవుతున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలూ అలాగే ఆయనకు చిక్కులు తెస్తున్నాయి. ఆక్సిజన్ ను పీల్చుకుని ఆక్సిజన్ ను విడుదల చేసే ఏకైక జంతువు ఆవు మాత్రమేనని రావత్ అనడంతో ఆ సీఎంపై సెటైర్లు కురిపిస్తున్నారు నెటిజన్లు.
ఆవు పాలలో - మూత్రంలో ఎన్నో విశేష గుణాలు ఉన్నాయని చెప్పిన ఆయన అక్కడితో ఆగకుండా ఆవును నిమిరితే శ్వాస సంబంధిత వ్యాధులు దూరమవుతాయని ఓ సిద్ధాంతాన్ని ప్రవచించారు. డెహ్రాడూన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఆవులకు సమీపంలో నివసిస్తే టీబీ (క్షయ వ్యాధి) తగ్గిపోతుందని అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. దీంతో సీఎం కార్యాలయం స్పందిస్తూ.. ఉత్తరాఖండ్ లో చాలామంది ప్రజలు ఆవు ఆక్సిజన్ ను విడుస్తుందని నమ్ముతారనీ - దాన్నే సీఎం చెప్పారని స్పష్టం చేశారు.
ఇంతకుముందు త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ కుమార్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. భారత్‌లో లక్షల ఏళ్ల కిందటే ఇంటర్ నెట్ ను ఆవిష్కరించారని ఆయన చెప్పుకొచ్చారు. మహాభారత కాలంలో ఇంటర్నెట్ ఒక్కటే కాదు - శాటిలైట్లు కూడా ఉండేవని ఆయన చెప్పారు. "మనది ఎలాంటి దేశమంటే... మహాభారతంలో సంజయుడు ఓ చోట కూర్చొని యుద్ధంలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు ధృతరాష్ట్రుడికి చెప్పేవాడు. దీని అర్థం ఏంటి? అంటే ఆ రోజుల్లోనే ఈ టెక్నాలజీ అంతా ఉనికిలో ఉందన్న మాట. ఇంటర్ నెట్ - శాటిలైట్లు.. ఇవన్నీ అప్పుడే ఉన్నాయి. లేదంటే సంజయుడు ఇదంతా తన కంటితో ఎలా చూడగలిగాడు?" అని ఆయన అప్పట్లో తన తెలివిని ప్రదర్శించారు.
ఇటీవల ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు అజయ్ భట్ మాట్లాడుతూ.. గరుడ్ గంగ నది నీరు తాగితే మహిళలకు సిజేరియన్ ఆపరేషన్ల అవసరం వుండదని చెప్పడంతో నెటిజన్లు ఓ స్థాయిలో ట్రోలింగ్ చేశారు