ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యక్తి కాదు శక్తి కాదని పలు సర్వేలు చెపుతున్నప్పటికీ ఆయనకంత సీన్ లేనేలేదని తేల్చేస్తూ సామన్యుడైన ఓ వ్యక్తిని చూసి మోడీ వణికిపోతున్నాడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తేల్చేశారు. చిన్నతనంలో కృష్ణుణ్ని చూసి కంసుడు ఏ విధంగా భయపడ్డాడో, జేఎన్ యు విద్యార్థి కన్నయ్యకుమార్ను చూసి మోడీ ఆ స్థాయిలో భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. సామాజికమార్పు కోసం పోరాటం చేస్తున్న కన్నయ్యపై దేశద్రోహం కింద కేసు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. అయితే పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో ఆర్ ఎస్ ఎస్ - బీజేపీలు భయపడేస్థాయికి వచ్చాయన్నారు.
ఢిల్లీ జేఎన్ యు విద్యార్థి ఛైర్మన్ గా ఉన్న కన్నయ్య సామాజిక ఎదుగుదలను చూసి ఓర్వలేకనే అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంబంధం ఉందని ముద్ర వేస్తున్నారని నారాయణ ఆరోపించారు. దున్నపోతు ఈనిందంటే గాట్లో కట్టేయండన్న చందంగా బీజేపీ తీరు ఉందని ఆరోపించారు. కల్పితమైన మీడియా క్లిప్పింగులు పెట్టి దేశద్రోహం కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ కు భరోసా ఇవ్వకపోవడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నారన్నారు. జేఎన్ యులో కన్నయ్యకు అన్ని పార్టీలవారు, సామాజికవేత్తలు దన్నుగా నిలిచారని చెప్పారు.