ఎవరన్నది కాదు.. ఏ విషయం మీద చేతులు కలిపామన్నదే ముఖ్యమన్నట్లుగా చెబుతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఎంతకైనా రెఢీ అంటున్న ఆయన.. హోదా మీద పోరు సందర్భంగా ఉత్తరాది.. దక్షిణాది అంటూ తరచూ కీలక వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. దక్షిణాది వారి పట్ల ఉత్తరాది పాలకులు అహంకారంతో వ్యవహరిస్తున్నారంటూ ఈ మధ్య కాలంలో తరచూ ఫైర్ కావటం తెలిసిందే.
అప్పుడెప్పుడో మద్రాసీ అనే మాట మీద మండిపడటం మినహా.. నార్త్.. సౌత్ అన్న మాటలు రాజకీయాల్లో వినపించని వేళ.. అందుకు భిన్నంగా పవన్ నోటి వెంట వస్తున్న మాటలు ఇప్పుడు కొత్త చర్చకు తావిచ్చేలా మారాయి. ఇదిలా ఉంటే..కమ్యూనిస్టులతో కలిసి వెళ్లేందుకు తాను సిద్ధమన్న విషయాన్ని పవన్ చెప్పటం తెలిసిందే.
పవన్ తో పాటు.. కామ్రేడ్స్ కూడా పవన్ తో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి వేళ.. జనసేనాధినేత పై సీపీఐ నారాయణ చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ చేస్తున్న ఉత్తరాది – దక్షిణాది వాదన కారణంగా లేనిపోని ఇష్యూలు రావటం తప్పించి మరెలాంటి ఉపయోగం ఉండదని.. ఈ తరహా నినాదాల వల్ల ప్రజాసమస్యలు పక్కదారి పట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేక హోదా మీద పోరాటంలో ఉత్తరాది – దక్షిణాది నినాదం రామాయణంలో పిడకల వేటగా మారిందని.. ప్రజా సమస్యలు పక్కదారి పడతాయని నారాయణ హెచ్చరిస్తున్నారు. ఈ తరహా మాటలు అసలైన ప్రజాసమస్యల్ని పక్కదారి పట్టేలా చేస్తాయమంటున్నారు. కలిసి నడవాల్సిన మిత్రుడిపై.. ఇలా ఓపెన్ గా అనేస్తే.. రేపొద్దున పవన్ తో కలిసి నడవాలని అనుకుంటున్న కామ్రేడ్ మిత్రులు.. స్నేహితుడిలో బొక్కలు వెతికే పని పెట్టుకున్న నారాయణ తీరును పలువురు తప్పు పడుతున్నారు.
పవన్ మాటలకు తగ్గట్లే ఆయన ఆరోపణలు ఉన్నాయన్న విషయాన్ని నారాయణ మర్చిపోకూడదని చెబుతున్నారు. తన నోటి దురదతో మిత్రుడ్ని మాట అనే కన్నా.. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడితే మంచిదన్న సూచనను పవన్ అభిమానులు చేస్తున్నారు. ఉత్తరాది.. దక్షిణాది అంటూ పవన్ చేసే వ్యాఖ్యలకు.. మధ్యలో నారాయణ చెబుతున్న మాటలే.. అసలుసిసలు పిడకల వేటగా అభివర్ణిస్తుండటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/