బిగ్ బాస్ పై నారాయణ మండిపాటు

Update: 2020-09-08 14:30 GMT
ఈ ఆదివారం ప్రారంభమైన తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’పై వివాదాలు సమసిపోవడం లేదు. హీరో అక్కినేని నాగార్జున యాంకర్ గా చేస్తున్న ఈ షోపై తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు.

బిగ్ బాస్ షో వల్ల ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని నారాయణ ప్రశ్నించారు. ఈ షో చూస్తుంటే హిమాలయంలో సాంస్కృతిక సంఘాన్ని తీసుకువచ్చి మురికికుంటలో పడేసినట్లు ఉందని అన్నారు.

ఇక షో వైభవం విజయ్ మాల్యా జీవించే భవనాల కంటే ఎంతో విలాసంగా ఉందని..యువతీ యువకులను 100 రోజుల ఇంట్లో పెట్టడం సరికాదని నారాయణ హితవు పలికారు.

ఇక యువకుడు అభిజిత్ ను నాగార్జున ఈ ముగ్గురు హీరోయిన్లలో ఎవరిని ముద్దు పెట్టుకుంటావ్ అనడంపై నారాయణ మండిపడ్డారు. యువతీ యువకులకు మీరిచ్చే సందేశం ఇదేనా అని నారాయణ ప్రశ్నించారు. కోట్ల మంది ప్రజలను టీవీ ముందు కూర్చుండబెడుతూ ఏం మెసేజ్ ఇస్తున్నారని.. సాంస్కృతిక దోపిడీ చేస్తున్నారని.. కళామతల్లికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
Tags:    

Similar News