ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విరుచుకుపడ్డారు. ఎస్సీ కులానికి చెందిన రోహిత్ వేములను బీసీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలిపిన నారాయణ ఈ చారిత్రక తప్పిదానికి పాల్పడుతున్న చంద్రబాబు దళిత ద్రోహిగా నిలిచిపోతారని విమర్శించారు. రోహిత్ దళితుడని కుల ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసిన కలెక్టర్ ఇపుడు మాట మార్చడం వెనుక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి ఉందని ఆరోపించారు. ఈ విషయాన్ని తాము పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళతామని నారాయణ తెలిపారు. ఎస్ సి - ఎస్ టి - బిసి - మైనార్టీల హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయ శంఖారావ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ప్రజా చైతన్య యాత్ర ఈ నెల 19న చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తుందని, 23న తిరుపతిలో బహిరంగ సభ ఉంటుందని నారాయణ తెలిపారు.
కాగా, తమిళనాడులో కేంద్ర ప్రభుత్వం శవ రాజకీయాలు చేస్తోందని నారాయణ మండిపడ్డారు. తమిళనాడు గవర్నర్ వ్యవహరించిన తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం న్యాయ - గవర్నర్ల వ్యవస్థల విలువలకు తిలోదకాలిస్తోందన్నారు. శశికళ ఎదుర్కొంటున్న ఆరోపణలు వాస్తవమైనప్పటికీ, శాసనసభ పక్షనేతగా ఎన్నికైన ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచి ఉండాల్సిందన్నారు. ఆమె విషయంలో న్యాయ వ్యవస్థను కూడా కేంద్ర ప్రభుత్వం వాడుకుందన్నారు.
మరోవైపు రోహిత్ వేముల దళితుడు కాదని - బీసీ అంటూ ఏపీ ప్రభుత్వం చెప్పడాన్ని దళిత - గిరిజన - విద్యార్థి - యువజన - ప్రజా సంఘాలు నిరసించాయి. ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను హైదరాబాద్ లోని ఆర్ టీసీ క్రాస్ రోడ్డు వద్ద గురువారం దహనం చేశారు. కుల వివక్ష కారణంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల బీసీ అని - ఆయన తల్లి రాధికకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రోహిత్ ఆత్మహత్యకు కారకులైన కేంద్ర మంత్రులు దత్తాత్రేయ - స్మృతి ఇరానీ - ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్ రావు - విసి అప్పారావును కాపాడడానికే దళితుడు కాదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రోహిత్ దళితుడే అంటూ గతంలో గుంటూరు జిల్లా కలెక్టర్ ప్రకటించారని, ఇప్పుడు మళ్లీ బీసీ అంటూ ఎలా నోటీస్ ఇస్తారని నిలదీశారు. రోహిత్ ను బీసీ అంటూ ఇచ్చిన నోటీస్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/