ఆసక్తికర భేటీ ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను తెలంగాణ సీపీఎం నేతలు కలవటం అందరి దృష్టిని ఆకర్షించింది. పెద్దగా హడావుడి లేకుండా వెళ్లిన కమ్యూనిస్టు నేతలు.. పవన్ ను కలిశారు. ధర్నా చౌక్ ను తరలించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పు పట్టిన సీపీఎం నేతలు.. ధర్నా చౌక్ పరిరక్షణకు తాము చేస్తున్న ఉద్యమానికి మద్దతు పలకాలంటూ తమ్మినేని వీరభద్రం.. చెరుకుపల్లి సీతారాములు తదితరులు పవన్ ను కోరారు.
ఇదిలా ఉంటే.. ఈ ఘటన చోటు చేసుకునే సమయంలోనే.. ఏపీ రాష్ట్ర రాజధాని విజయవాడలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీపీఎం అగ్రనేతల్లో ఒకరైన సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరచూ ప్రస్తావించే ఉత్తరాది.. దక్షిణాది ముచ్చట మీద సీతారాం ఏచూరి రియాక్ట్ అయ్యారు.
పవన్ వ్యాఖ్యల్ని తప్పు పట్టిన ఆయన.. ఇలా ప్రాంతీయ విభేదాలు సృష్టించేలా మాట్లాడటం తప్పన్నారు. ఏదైనా ప్రత్యేక అంశం ఉంటే.. దాని వరకూ ప్రస్తావించాలే కానీ.. ప్రతి విషయాన్ని ఉత్తరాది.. దక్షిణాది అంటూ విడదీసి మాట్లాడటం సరికాదని.. ఈ విధానాన్ని తాము తప్పు పడతామని చెప్పటం గమనార్హం. ఒకేరోజు.. ఇంచుమించు ఒకే సమయంలో ఒకే పార్టీకి చెందిన ఆగ్ర నేతలు.. మరో పార్టీ అధినేతను వేర్వేరుగా వ్యవహారాల్లో మద్ధతు కోసం భేటీ కావటం.. మరోవైపు.. ఆయన విధానాల్ని తప్పు పట్టటం ఆసక్తికరమైన అంశంగా చెప్పక తప్పదు.