విద్యార్థులు జాతీయ జెండాను అవ‌మానించారా?

Update: 2017-06-14 16:41 GMT
జాతీయ జెండా - జాతీయ గీతాన్ని అవమానించేలా సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్‌ ఎఫ్‌ ఐ(స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఓ కార్టూన్‌ ను  చిత్రీకరించింది. కేరళలోని కన్నూర్ ప్రభుత్వ బ్రెన్నన్ కళాశాల ఎస్‌ ఎఫ్‌ ఐ యూనియన్ ఆధ్వర్యంలో కళాశాల 125 సంవత్సరాల వేడుకల సందర్భంగా పెల్లెట్ పేరుతో మ్యాగజైన్‌ ను విడుదల చేశారు. సినిమా థియేటర్లలో సినిమా ప్రారంభోత్సానికి ముందు జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. అయితే ఈ విషయాన్ని ఎస్‌ ఎఫ్‌ ఐ ఆశ్లీలంగా చిత్రీకరించింది.

సినిమా హాలులో తెరపై జాతీయ జెండాను ఉంచి.. కుర్చీల్లో ఓ జంట అసభ్య రీతిలో ఉన్నట్లు చేతితో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ఇదే చిత్రాన్ని పెల్లెట్ మ్యాగజైన్‌ లో కూడా అచ్చు వేయించారు. జాతీయ గీతాన్ని అవమానించేలా ఉన్న ఈ చిత్రంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మ్యాగజైన్ పంపిణీని ఎస్‌ ఎఫ్‌ ఐ నిలిపివేసింది. దీనిపై బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ఎస్‌ ఎఫ్‌ ఐ కార్టూన్‌పై ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తాజిందర్ పాల్‌ సింగ్ బగ్గా స్పందించారు. జాతీయ గీతాన్ని అవమానించిన ఎస్‌ ఎఫ్‌ ఐ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ గీతం థియేటర్లో ప్లే అవుతుండగా శృంగారంలో పాల్గొనాల్సిందిగా ఎస్ ఎఫ్ ఐ పిలుపునిస్తోందని ధ్వజమెత్తారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News