ఆయన ఓ నేరం చేసి తీహార్ జైలుకు వచ్చాడు.. తన నేర ప్రవర్తన మారుతుందని అందరూ అనుకున్నారు.. కానీ ఆయన ఆగడాలు మాములుగా లేవు.. ప్రముఖులతో పరిచయాలు పెంచుకొని ఏకంగా జైలులోనే దుకాణం పెట్టాడు. పెద్ద పెద్ద సెటిల్మెంట్లు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించారు. ఈ క్రమంలో తనకు ఈ జైలులో సౌకర్యం లేదని..తనకు ప్రాణహాని ఉందని.. మరోజైలుకు మార్చాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడు.
అయితే ఆయన వేసిన ఈ పిటిషన్ ను కొట్టివేయాలని ఈడీ కోరింది. ఆయనను మరో జైలుకు మార్చితే అనేక ఘోరాలు జరిగిపోతాయని ఈడీ అధికారులు వివరించారు.. ఆయనెవరు..? ఇంతకీ ఏం చేశాడు..?
సుకేశ్ చంద్రశేఖర్ అనే ఖైదీ తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తనకున్న టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రముఖులతో పరిచయం చేసుకున్నాడు. జైలు అధికారులతో కూడా స్నేహం చేస్తూ వారికి భారీ గిప్ట్ లు ఇచ్చేవాడు.
ఇలా పలుకుబడిని సాధించిన తరువాత తన నైపుణ్యంతో ఇతరులను మోసం చేసేవాడు. ఇలా తానుంటున్న జైలులో ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచే నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడు. తన భార్య లీనాతో కలిసి ఇతరులను మోసం చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించాడు.
కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజల్ బల్లాలాగా మాట్లాడి రాన్ బాక్సీ కంపెనీ ప్రమోటర్ శివిందర్ మోహన్ భార్య అదితిసింగ్ నుంచి రూ.215 కోట్లు వసూలు చేశాడు. ఇలా తన సామ్రజ్యాన్ని సహకరించినందుకు జైలు అధికారులకు ఖరీదైన బహుమతులు అందించాడు. దీంతో టీవీ రంగానికి చెందిన ప్రముఖ నటీమణులు సుకేశ్ కోసం తీహార్ జైలుకు వచ్చేవారు. తనకోసం వచ్చేవారికి ప్రత్యేకంగా బీఎండబ్యూ కారును కూడా ఏర్పాటు చేశాడు.
అయితే ఇప్పుడు జైలు తనకు సౌకర్యంగా లేదని, తనకు ప్రాణహాని ఉందని సుకేశ్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడు. కానీ అతని పిటిషన్ ను తిరస్కరించాలని ఈడీ సుప్రీంను కోరింది. సుకేశ్ ను మరో జైలుకు మార్చితే ఇదే నేర సామ్రాజ్యాన్ని కొనసాగిస్తాడని పేర్కొంది. తాము సుకేశ్ పై విచారణ చేసిన తరువాత అసలు విషయం బయటపడిందని, ఇక్కడ లోపాలను చక్కదిద్దామని, సుకేశ్ కు సహకరించిన ఇక్కడి అధికారులకు అడ్డుకట్ట వేశామని ఈడీ అధికారులు తెలిపారు.