ముంబయి నటుడు కాల్చుకుని చనిపోయాడు

Update: 2016-12-14 05:54 GMT
ఈ మధ్య వరుసగా టీవీ ఇండస్ట్రీకి చెందిన కొందరు ఆర్టిస్టులు ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తున్నాం. ఈ కోవలోకి మరో నటుడు చేరాడు. ముంబయిలో టీవీ సీరియళ్లు చేసే కమలేష్ పాండే అనే నటుడు రివాల్వర్ తో తనను తాను కాల్చుకుని ప్రాణాలు విడిచాడు. అతను ‘క్రైమ్ ప్యాట్రల్’ టీవీ సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. టీవీ రంగంలో బిజీ అవుతున్న నటుడు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడటంతో ముంబయి టీవీ ఇండస్ట్రీ షాకైంది. కమలేష్ పాండే ఆత్మహత్యకు సరైన కారణాలేంటో తెలియరాలేదు. ఐతే అతను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు బాగా మద్యం సేవించినట్లు విచారణలో తేలింది.

మధ్యప్రదేశ్ లోని జబల్పూర్లో కమలేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో కమలేష్ భార్య సోదరి అయిన అంజనా చతుర్వేది కూడా ఉంది. కొన్ని రోజుల కిందట అంజనా కూతురికి పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి కమలేష్ పాండేను ఆహ్వానించలేదట. ఈ విషయంలో కమలేష్ మనస్తాపానికి గురై.. అంజనాతో వాగ్వాదానికి దిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. బాగా మద్యం సేవించిన కమలేష్.. గాల్లోకి ఒక రౌండు కాల్పులు జరిపి.. ఆ తర్వాత ఛాతీ మీద కాల్చుకున్నాడు. అంజనాతో పాటు చుట్టు పక్కల వాళ్లు అంబులెన్సుకు సమాచారం ఇచ్చినప్పటికీ.. వాళ్లు వచ్చేటప్పటికే కమలేష్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం తరలించి విచారణ చేపట్టారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News