బిట్ కాయిన్ పేరుతో గత కొద్దికాలంగా సాగిన ఆశావాహ వ్యాపారం తన దుర్వార్తలను వినిపిస్తోంది. గత వారం ఓ వ్యాపారి రెండువేల కోట్ల రూపాయలకు టోకరా పెట్టగా తాజాగా నిబంధనల రూపంలో షాకులు ఎదురవుతున్నాయి. భారత రిజర్వ్ బ్యాంకు(ఆర్ బిఐ) క్రిప్టో కరెన్సీల లావాదేవీలపై బ్యాంకులను కట్టడి చేయడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. ఓవైపు నిబంధనల ఒత్తిడి మరోవైపు మార్కెట్ అయోమయ స్థితికి చేరిన నేపథ్యంలో బిట్ కాయిన్ వ్యాపారంలోకి అడుగిడిన వారు గందరగోళంలో పడ్డారని ప్రచారం జరుగుతోంది.
ఆర్‌బీఐ తాజా నిబంధనల నేపథ్యంలో క్రిప్టోకరెన్సీలను వెంటనే విక్రయించి తమ బ్యాంకు ఖాతాల్లోకి నగదురూపేణా వాటిని బదిలీ చేయని పక్షంలో అవి తమదగ్గరేఉండిపోతున్నాయని ఇన్వెస్టర్లు కలత చెందుతున్నారు. 2018 ఆర్థిక సంవత్సరంలో చేసిన రిటర్నులపై ఎంత పన్ను కట్టాలని నిపుణులను ఆరాతీస్తున్నారు. జులై మాసాంతంలోగా పన్ను చెల్లించవచ్చా అంటూ ఎంక్వైరీలు చేస్తున్నారు. అంతేకాకుండా ఐటీ అధికారులు, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలు తమపై ఎక్కడ దాడులు చేస్తారో అని భీతిల్లుతున్నారని నిపుణులు అంటున్నారు. కాగా, ఆదాయ పన్ను శాఖ బిట్‌కాయిన్స్, ఇతర క్రిఎ్టో కరెన్సీల ట్రేడింగ్ ను కాపిటల్ గెయిన్లు లేదా స్పెక్యులేటివ్ ఇన్ కమ్ గా పరిగణించవచ్చని అంటున్నారు. స్పెక్యులేటివ్ బిజినెస్ ఆదాయానికి దాదాపు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది అని ఆయన చెప్తున్నారు. క్రిప్టో కరెన్సీలను కనీసం 36 మాసాలు కలిగి ఉన్న పక్షంలో 20 శాతం దీర్ఘకాలిక మూలధన రాబడులపై పన్ను విధిస్తారని ఆదాయ పన్ను నిపుణులు అంటున్నారు. ఇతర కేసుల్లో 30 శాతం స్వల్ప కాలిక మూలధన రాబడులపై పన్ను వర్తిస్తుంది. క్రిప్టో కరెన్సీలను చట్టవిరుద్ధమైనవిగా భావించడం లేదు కనుక 20 శాతం పన్ను చెల్లిస్తే చాలని ఇతర సలహాదారులు ఇన్వెస్ట ర్లకు సూచిస్తున్నారు.