పోలీసులను టార్గెట్​ చేసిన సైబర్​ నేరగాళ్లు.. ఈ సారి తిరుమల!!

Update: 2020-09-26 23:30 GMT
గత కొంతకాలంగా పోలీసులు సైబర్​ నేరగాళ్లను టార్గెట్​ చేస్తున్న విషయం తెలిసిందే. పోలీసుల పేరుతో నకిలీ ఫేస్​బుక్​ ఖాతాలు ఓపెన్​ చేయడం.. వాటి నుంచి పోలీసు అధికారుల స్నేహితులతో చాట్​ చేస్తూ సైబర్​ నేరగాళ్లు లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. హైదరాబాద్​ - నెల్లూరు - కర్నూల్​ జిల్లాల్లో గతంలో ఈ ముఠా రెచ్చిపోయంది. అయితే సైబర్​ ముఠా తాజాగా ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల మీద పడింది. గతంలో ఫేక్​ ఐడీలు క్రియేట్​ చేసి మోసాలకు పాల్పడ్డ సైబర్​ దొంగలు ఈ సారి రూటు మార్చారు. ఏకంగా పోలీస్​ అధికారుల అకౌంట్లనే హ్యాక్​ చేశారు. హ్యాక్​ చేసిన అకౌంట్ల నుంచి లిస్ట్​లో ఉన్న స్నేహితులకు మెసెంజర్​లో అర్జంటుగా డబ్బులు కావాలంటూ మెసేజ్​లు పంపుతున్నారు.

కొంతమంది పోలీసులకు డౌట్​ వచ్చి సహచర పోలీసులకు ఫోన్​ చేయడంతో ఈ బండారం బయటపడింది. తిరుమల, తిరుపతికి చెందిన చాలా మంది పోలీస్​ అధికారుల ఫేస్​బుక్​ అకౌంట్లను సైబర్​ ముఠా హ్యాక్​ చేసినట్టు సమాచారం.
సీఐలు రామకృష్ణ, సాయిగిరిధర్‌.. ఎస్సైలు తిమ్మయ్య, సుమతి ఫేస్‌బుక్‌ అకౌంట్లు హ్యాక్ చేసిన దుండగులు.. డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారు. దీంతో తిరుపతి, తిరుమల పోలీసులు ప్రెస్​మీట్​ పెట్టి ఈ విషయాన్ని చెప్పారు. పలువురు పోలీస్​ అధికారుల సోషల్​మీడియా ఖాతాలను సైబర్​ దుండగులు హ్యాక్​ చేశారని.. వారి పేరుమీద వచ్చే మెసేజ్​లకు ప్రజలెవరూ స్పందించవద్దని.. అనుమానం వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారు కోరారు. మరోవైపు తిరుపతి సైబర్​క్రైం పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారు. హ్యాకర్లు ఏ ఐడీ నుంచి వీటిని హ్యాండిల్​ చేస్తున్నారో కనుక్కొనేందుకు ముమ్మరంగా యత్నిస్తున్నారు.




Tags:    

Similar News