గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీమంత్రి - సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్ తో..బీజేపీతో..టీడీపీతో కాదు...వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీతో...దగ్గుబాటి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం కన్ఫామ్ అయిపోయింది. ఇవాళ లోటస్ పాండ్ లో జగన్ తో దగ్గుబాటి వెంకటేశ్వరరావు - హితేష్ లు భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం మీడియాతో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ హితేష్ కు పర్చురు టికెట్ కు సంబంధించి తమకు జగన్ ఎటువంటి హామీ ఇవ్వాలేదని చెప్పారు. ఆ పార్టీతో ఇప్పుడే ప్రయాణం ప్రారంభించామని.. టికెట్ విషయం జగన్ నిర్ణయిస్తారని చెప్పారు. వైసీపీలో ఎప్పుడు చేరేదీ త్వరలోనే ప్రకటిస్తామన్నారు. జగన్ వ్యవహారశైలిపై ఇటీవల పలురకాలుగా ప్రచారం జరుగుతోందని.. కానీ తనకు అలా అనిపించలేదని దగ్గుబాటి అన్నారు. రెండేళ్ల నుంచి జగన్ బయటనుంచే పరిశీలిస్తున్నానని ఆయన చెప్పారు.
ఇలా - దగ్గుబాటి రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆదిలోనే ఆయనకు ఊహించని షాక్ తగలనుందని అంచనా వేస్తున్నారు. తాజా భేటీలో ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం టికెట్ హితేశ్ కి ఇచ్చే విషయంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడి నుండి పోటీ చేయాలని హితేశ్ ఆశిస్తున్నారు. అయితే హితేశ్ అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నారు. ఈ పౌరసత్వం రద్దుకు దరఖాస్తు కూడా చేసుకున్నట్లు టాక్. అమెరికా పౌరసత్వం ఉన్నవారు భారత ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే విషయం తెలిసిందే. ముందుగా ఈ సమస్య పరిష్కరించుకోవాలని భేటీ సందర్భంగా జగన్ వారిద్దరికీ సూచించినట్లు తెలుస్తోంది. హితేశ్ అమెరికా పౌరసత్వం రద్దుకు ఆమోదం వచ్చిన తర్వాత దగ్గుబాటి, ఆయన కొడుకు జగన్ సమక్షంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరుతారని టాక్. ఒకవేళ ఎన్నికల వరకు ఈ సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం హితేశ్‌కి టికెట్ ఇవ్వకుండా దగ్గుబాటికి ఇవ్వడానికి వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఆచితూచి నిర్ణయం వెలువడనుందని అంటున్నారు.