పురంధేశ్వరికి వైసీపీ బంపర్ ఆఫర్

Update: 2019-04-29 11:19 GMT
బీజేపీ నేత - విశాఖ నుంచి ఎంపీగా పోటీచేసిన దగ్గుబాటి పురంధేశ్వరికి వైసీపీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ ప్రకటించింది ఎవరో కాదు.. ఆమె భర్త - వైసీపీ సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు. సోమవారం ఓ ఇంటర్వ్యూలో దగ్గుబాటి మాట్లాడారు. ఏపీలో బీజేపీ కష్టకాలంలో ఉందని.. ఈ సమయంలో ఆ పార్టీని వదిలి వెళ్లడం సరైంది కాదనే అభిప్రాయాన్ని ఆమె వెలిబుచ్చారని.. వైసీపీలోకి వస్తే ఆమెకు కోరుకున్న పదవి ఇస్తామని దగ్గుబాటి తెలిపారు.

పురంధేశ్వరికి వైసీపీ దారులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని.. ఇప్పుడే కాదు.. గతంలోనూ వైసీపీ నుంచి భారీ ఆఫర్లు   వచ్చాయని దగ్గుబాటి కుండబద్దలు కొట్టారు. ఏ స్థానం కోరుకున్నా ఆమెకు ఇచ్చేందుకు వైసీపీ సిద్ధంగా ఉన్న విషయాన్ని దగ్గుబాటి ప్రస్తావించారు. పార్టీని వీడేందుకు పురంధేశ్వరీ మొన్నటి ఎన్నికల వేళ ఒప్పుకోలేదని వివరించారు.

హితేష్ చెంచురామ్ వైసీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నందున అతడి కోసం అవసరమైతే తాను రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని కూడా భావించారని దగ్గుబాటి గుర్తు చేశారు. చెంచురామ్ వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్న సమయంలో ఈ విషయమై తనతో పురంధేశ్వరీ చర్చించారని తెలిపారు. భవిష్యత్ లో వైసీపీలో చేరేందుకు పురంధేశ్వరి సిద్ధంగా ఉందని దగ్గుబాటి సంచలన విషయాలు వెల్లడించారు.
   

Tags:    

Similar News