ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి సీఎం అయిన చంద్రబాబు లక్ష్మీపార్వతిని తీవ్రంగా వ్యతిరేకిసస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే... అదే చంద్రబాబు ఒకప్పుడు లక్ష్మీపార్వతి ఇంటి నుంచి బయటకు అడుగు తీస్తే చాలు ఆమె కారు డోర్ తెరిచి పట్టుకునేరాట. ఈ సంగతి ఎవరూ నమ్మకపోవచ్చు కానీ, ఇది నిజం అంటున్నారు చంద్రబాబు తోడల్లుడు, ఎన్టీఆర్ అల్లుడు అయిన దగ్గుబాటి.
రీసెంటుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు తీవ్రంగా వ్యతిరేకించిన సమయంలోనూ చంద్రబాబు ఆమె కారు డోర్ తీసేవారని... ఆమె గుడ్ లుక్స్ లో పడి రాజకీయాల్లో రాణించాలని తాపత్రయ పడేవారని... దాంతో ఎన్టీఆర్ కూడా ఎన్నడూ చంద్రబాబును అనుమానించలేదని.. ఎన్టీఆర్ అంత గుడ్డిగా నమ్మడంతో చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని దగ్గుబాటి తెలిపారు.
అయితే... ఆ వెన్నుపోటులో తనకూ భాగస్వామ్యం ఉందని.. చంద్రబాబుతో తాను కూడా అప్పుడు కలిశానని ఆయన గుర్తు చేసుకున్నారు. తనకు ఉప ముఖ్యమంత్రి పదవి, హరికృష్ణకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తానని నమ్మించి తమను తిప్పుకొన్నారని ఆయన అన్నారు. అయితే... ఈ కుట్రల్లో తన భార్య పురందేశ్వరికి కానీ, చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి కానీ ఎలాంటి పాత్రా లేదని ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు. వారిద్దరికీ ఇవేమీ అప్పట్లో తెలియవని చెప్పారు.
ఇక ప్రస్తుత కాలానికి వస్తే ఎన్టీఆర్ లా ప్రజాదరణ పొందగల సత్తా జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే ఉందని, ఆయన రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి మారిపోతుందని అన్నారు. అయితే, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారో రాదో తనకు తెలియదని చెప్పారు. బాలకృష్ణకు కూడా మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పారు. ఎన్టీఆర్ వారసత్వం బాలయ్యకు ఇవ్వాలా, లోకేశ్ కా అన్నది ప్రజలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు.