జనవరి 30 బుధవారం 2019 దినఫలాలు

Update: 2019-01-30 01:30 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
    
మేషరాశి:    ఆదాయం తగ్గి నిరాశలో కూరుకుపోతారు. కుటుంబం నుంచి ఒత్తిడులు. మిత్రులతో వైరం. కాంట్రాక్టులు చేజారుతాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు పనిభారం. కళాకారులు, రాజకీయవేత్తలకు ఆటంకాలు. ఐటీ నిపుణులు శ్రమ పడుతారు. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు మానసిక అశాంతి. షేర్ల విక్రయాల్లో తొందరవద్దు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని పూజిస్తే మంచిది.   

వృషభరాశి: ఆర్థిక విషయాల్లో సంతృప్తి. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామిక, కళారంగాల వారికి పురస్కారాలు. ఐటీ నిపుణులు వ్యవహారాలు పూర్తి చేస్తారు.  విద్యార్థులకు కొత్త అవకాశాలు. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది.

మిథునరాశి: భవనాలు, వాహనాలు కొంటారు. కుటుంబంలో చికాకులు. రియల్ ఎస్టేట్ ల వారికి అంచనాల్లో పురోగతి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు. ఉద్యోగులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు సత్కారాలు, ఆహ్వానాలు. ఐటీ నిపుణులకు సంతోషకర విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు. మహిళలకు మనశ్శాంతి. గణేశాష్టకం పఠిస్తే మంచిది.

కర్కాటకరాశి: ఆస్తి విషయాల్లో సమస్యలు. రియల్ ఎస్టేట్ లు, కాంట్రాక్టర్లకు చిక్కులు తప్పవు. వ్యాపారులు నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు. పారిశ్రామిక, కళారంగాల వారికి ఒత్తిడులు. ఐటీ నిపుణులకు క్లిష్ట సమస్యలు ఎదురవతాయి. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. వేంకటేశ్వరస్వామిని పూజిస్తే మంచిది.

సింహరాశి: ఆర్థిక విషయాల్లో నిరాశ. ఆరోగ్యం మందగిస్తుంది. వృథా ఖర్చులు. శ్రమాధిక్యం.. ఫలితాలుండవు. బంధువులతో వైరాలు. ప్రయాణాల్లో జాగ్రత్త. రియల్ ఎస్టేట్ వారికి కొత్త అవకాశాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో మార్పులు. పారిశ్రామిక, కళారంగాల వారికి ఒత్తిడులు. ఐటీ నిపుణులకు సమస్యలు. విద్యార్థులు జాగ్రత్త వహించాలి. మహిళలకు బంధువులతో వైరం. దత్తాత్రేయ పూజలు చేయండి.

కన్యరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. రుణాలు సైతం తీరుతాయి. కోర్టు కేసుల పరిష్కారం. రియల్ ఎస్టేట్ వారికి వ్యాపారాల్లో ముందడుగు. వ్యాపారాల్లో ఊపు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక, కళారంగాల వారికి మంచికాలం. ఐటీ నిపుణులకు అవకాశాలు. విద్యార్థులకు అనుకూలం. మహిళలకు సంతోషకరంగా ఉంటుంది.  నృసింహస్తోత్రాలు పఠిస్తే మంచిది.

తులరాశి:  కోర్టు కేసులతో చికాకులు. సన్నిహితులే సమస్యలు సృష్టిస్తారు. అప్రమత్తత అవసరం. ఆర్థిక పరిస్థితి నిరాశజనకం. రియల్ ఎస్టేట్ ల వారికి అవాంతరాలు. ఉద్యోగులకు ఒత్తిడులు. వ్యాపారులు తొందరపాటు నిర్ణయాలు వద్దు. పారిశ్రామిక, కళారంగాల మనోవేదన తప్పదు. ఐటీ నిపుణులకు చిక్కులు. మహిళలకు నిరుత్సాహం. శ్రీరామ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

వృశ్చిక రాశి: ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు. వాహనయోగం. అదనపు రాబడి. రియల్ ఎస్టేట్ వారికి సంతృప్తికర లాభాలు. వ్యాపారాలు విస్తరణ. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరం. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీయానం. ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం. విద్యార్థులకు పరీక్షల్లో ఉత్తీర్ణత. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. విష్ణు ధ్యానం చేస్తే మంచిది.

ధనస్సురాశి: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహం. ఆకస్మిక ప్రయాణాలు. ఒక సమాచారంతో గందరగోళం.  రియల్ ఎస్టేట్ ల వారికి సమస్యలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తప్పవు. కళాకారులు, రాజకీయవర్గాలకు విమర్శలు. ఐటీ నిపుణులకు ఒడిదుడుకులు. విద్యార్థులు మరింత శ్రమపడాలి. మహిళలకు కుటుంబంలో ఒత్తిడులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠిస్తే మంచిది.

మకరరాశి: రియల్ ఎస్టేట్ వారికి ఆశలు ఫలిస్తాయి. సమయానికి డబ్బు అందుతుంది. వ్యాపారాల్లో దూసుకుపోతారు. లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశాల నుంచి ఆహ్వానాలు. ఐటీ నిపుణుల కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మహిళలకు మరింత సానుకూలం. ఆంజనేయ దండకం పఠిస్తే మంచిది.  

కుంభరాశి: వాహన, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. రాబడి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి గందరగోళ పరిస్థితులు. వ్యాపారాల్లో చిక్కులు. ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రశంసలు పొందుతారు. పారిశ్రామిక, కళారంగాల సన్మానాలు, పదవీ యోగాలు. ఐటీ నిపుణులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. విద్యార్థులు కొంత సంతృప్తి చెందుతారు.మహిళలకు భూములు, వాహనాలు సమకూరుతాయి. గణేష్ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

మీనరాశి: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. పనుల్లో ఆటంకాలు. రియల్ ఎస్టేట్ వారికి భూవివాదాలు జఠిలమవుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లు. పెట్టుబడుల్లో జాప్యం. ఉద్యోగులకు పనిభారం. జ్వరం, జలుబు వంటి రుగ్మతలు తప్పవు. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు కొంత నిరాశ. విద్యార్థులకు చిక్కులు. మహిళలు సోదరుల నిర్ణయాలను వ్యతిరేకిస్తారు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠిస్తే మంచిది.
    
    
    

Tags:    

Similar News