ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. జూన్‌ 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు !

Update: 2021-06-07 09:05 GMT
కరోనా వైరస్ మహమ్మారి కట్టడి లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం. ప్రస్తుతం జూన్ 10తో కర్ఫ్యూ గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ పై అధికారులతో రివ్యూ నిర్వహించారు సీఎం జగన్. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 20 వరకు కర్ఫ్యూను పొడిగించాలని సీఎం నిర్ణయించారు. అలాగే సడలింపులపైనా కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే , కర్ఫ్యూ వేళల్లో కాస్త సమయాలను మార్పులు చేసింది ప్రభుత్వం తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపు ఇస్తున్నట్లు పేర్కొంది.

అలాగే ప్రభుత్వ కార్యాలయాలు ఉ.8 గంటల నుంచి మ.2 గంటల వరకు పనిచేయనున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతులు ఇస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత ఎవరైనా రోడ్డుపై కనిపిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. అత్యవసరం ఉందని రుజువులు చూపించినా, అనుమతులు ఉన్నవారికి మాత్రమే మినహాయింపు ఇస్తున్నారు. కానీ ఇకపై మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సమయాన్ని పెంచారు. అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు నిత్యావసారల కోసం రోడ్డుపైకి వెళ్లే వెసులుబాటు దక్కింది. ప్రస్తుతం ఏపీలో అమలు చేస్తున్న కఠిన కర్ఫ్యూ మంచి ఫలితాలను ఇస్తోంది. ఇలాంటి సమయంలో నిర్లక్ష్యంగా ఉండడం మంచిది కాదని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఇవాళ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ పై రివ్యూ నిర్వహించిన ఆయన , కర్ఫ్యూను మరో పది రోజుల పాటు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ లో కఠిన కర్ఫ్యూ మంచి ఫలితాలు ఇస్తోంది. దీంతో మరో వారం రోజుల పాటు కర్ఫ్యూను పొడిగించే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 10తో కర్ఫ్యూ గడువు ముగుస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా, కర్ఫ్యూ కొనసాగించడమే మేలని ఏపీ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. తాజాగా ఏపీలో కరోనా కేసులు భాగానే కట్టడి అవుతున్నాయని, మరింత అప్రమత్తంగా ఉంటే పూర్తిగా కట్టడి సాధించవచ్చని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. సండలింపుల్లో మార్పులు  చేసినా, మధ్యాహ్నం తరువాత స్ట్రిక్ట్ గా నిబంధనలు అమలు అయ్యేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన పరిస్థితి  మళ్లీ మొదటికి వస్తుందని హెచ్చరించారు.
Tags:    

Similar News