భారత్‌లో నవంబర్ ‌లో వైరస్ విజృంభణ పెరుగుతుందా...క్లారిటీ ఇచ్చిన ICMR

Update: 2020-06-15 09:10 GMT
ప్రస్తుతం భారతదేశంలో వైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. రోజురోజుకి నమోదు అయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య ఊహించని విదంగా పెరిగిపోతున్నాయి. వైరస్ కట్టడికి తీసుకున్న చర్యలన్నీ కూడా విఫలం అవుతున్నాయి. ఇకపోతే , భారత వైద్య పరిశోధనా మండలి - ICMR ఈ మహమ్మారి గురించి  ఏం చెప్పినా మనం నమ్మవచ్చు. ఎందుకంటే... కచ్చితమైన ఆధారాలు ఉంటేనే ICMR తన రిపోర్టులను రిలీజ్ చేస్తుంది.

తాజాగా... ఐసీఎంఆర్ ఏర్పాటు చేసిన ఆపరేషన్స్ రిసెర్చ్ గ్రూప్ చేసిన ఓ పరిశోధన ప్రకారం భారత్‌ లో నవంబర్ మధ్య నాటికి  వైరస్ పీక్ స్టేజ్‌కి చేరే అవకాశం ఉందని , ఆ సమయం లో ఐసోలేషన్ బెడ్లు, ఐసీయూలు, వెంటిలేటర్లకు అత్యంత తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉన్నట్టు రిపోర్టు చెప్పింది. అలాగే, భారత్ ‌లో లాక్ డౌన్ ప్రకటించడం వల్ల వైరస్ అత్యంత ప్రభావం చూపే సమయం 34 నుంచి 76 రోజులకు పెరిగిందని రిపోర్టు తెలిపింది. లాక్ డౌన్ విధించడం వల్లే 97 శాతం నమోదవ్వాల్సిన కేసులు 69 శాతం నమోదవుతున్నాయని చెప్పింది.

అయితే ,ఈ మొత్తం రిపోర్టును ICMR ఖండించింది.ఈ సర్వే జరిపిన వారితో ICMR కి ఎలాంటి సంబంధమూ లేదనీ... ఈ సర్వేకి ఎలాంటి అధికార గుర్తింపూ లేదని ICMR స్పష్టం చేసింది. అయితే , ఇప్పటికే ఈ న్యూస్ దేశం మొత్తం పాకిపోయింది. మొత్తానికి ICMR ఖండించింది కాబట్టి... ఇది నిజం కాదని మనకు తెలిసింది. గతంలో  ఇండియా లో ఈ వైరస్ జూన్ చివరి నాటికి పీక్ స్టేజ్‌ కి చేరుతుందనీ, జులై నాటికి చేరుతుందనీ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News