మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ.. హెల్త్ ఇన్యురెన్సులు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఇటీవల కాలంలో పెరిగిన వైద్య ఖర్చులతో ముందుస్తు జాగ్రత్తల్లో భాగంగా ఎక్కువ మంది హెల్త్ పాలసీలు తీసుకుంటున్నారు. మాయదారి రోగం అంటితే.. అదెక్కడి వరకు వెళుతుందో అర్థం కాని పరిస్థితి. దీనికి తోడు.. ప్రైవేటు ఆసుపత్రుల్లో దీని ఖర్చు భారీగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా కొన్ని బిల్లులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో హెల్త్ ఇన్య్సురెన్సులు ఉన్నోళ్లు తమ పరిధిని మరింత పెంచుకుంటుంటే.. లేనోళ్లు కొత్తగా తీసుకునేందుకు సిద్దమతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా బీమా కంపెనీలు కొత్త ఆపర్లను తెర మీదకు తెస్తున్నాయి. సాధారణంగా కొత్త పాలసీలు తీసుకున్న వారు.. ఆ పాలసీని వినియోగించుకునేందుకు వెయిటింగ్ పిరియడ్ ఉంటుంది. గతంలో 30 రోజులుగా ఉండేది. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని పదిహేను రోజులకు తగ్గించినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇదొక్క మాయదారి రోగానికి మాత్రమేనని.. మిగిలిన వ్యాధుల విషయంలో మాత్రం పాత పద్దతే కొనసాగుతుందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా కొన్ని బీమా కంపెనీలు ఆసుపత్రిలో చేరితేనే ఖర్చులు ఇచ్చేది. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆసుపత్రుల్లో చేరకున్నా.. ఇంట్లో ఉండి క్వారంటైన్ లో ఉన్నప్పటికీ ఖర్చులకు డబ్బులిచ్చేలా కొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్య బీమా తప్పనిసరి. అనుకోని పరిస్థితుల్లో అనారోగ్యానికి గురై ఇంట్లోనే ఉండి చికిత్స చేయించుకున్నా ఖర్చులు చెల్లించే విధానంతో మరింత ప్రయోజనం కలుగుతుందని చెప్పక తప్పదు.