కరోనా మహమ్మారి కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. జీడీపీ వృద్ధిరేటు ఘోరంగా పడిపోయినట్లు కేంద్ర స్టాటిస్టిక్స్ మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. త్రైమాసిక జీడీపీ ఫలితాలను 1996 నుండి విడుదల చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంతగా ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో జీడీపీ మైనస్ 23.9 శాతానికి క్షీణించింది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని అధికార పార్టీ చెబుతోంది. ఇది భగవంతుడి చర్యగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
అయితే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి కరోనా మహమ్మారి ఒక్కటే కారణం కాదని, 2018-19 ఆర్థిక సంవత్సరం నుండే దేశ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తూ వస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2016లో పెద్ద నోట్ల రద్దు, ఆ తర్వాత ఏడాది జీఎస్టీ తీసుకు వచ్చారని, వీటి వల్ల కూడా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని, పెనం మీది నుండి పొయ్యిలో పడినట్లు దీనికి కరోనా మహమ్మారి జత కలిసిందని చెబుతున్నారు.
భారత జీడీపీ కంటే అమెరికా జీడీపీ భారీగా పడిపోయిందని చెబుతున్నప్పటికీ, ఏడాది త్రైమాసికం నాటికి అమెరికా జీడీపీ మైనస్ 9.1 శాతంగా ఉండగా, భారత్ జీడీపీ మైనస్ 23.9 శాతంగా ఉంది. కరోనా కారణంగా భారత్ ఎక్కువగా నష్టపోయినట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయని అంటున్నారు. చైనా వృద్ధి రేటును మైనస్ 3.2 శాతం, రష్యా మైనస్ 8.2 శాతం ఉన్నాయి. ఈసారి ఆర్థికంగా ఎక్కువగా నష్టపోయిన 11 దేశాల్లో భారత్ ముందు ఉంది.