కరోనా చేస్తున్న విలయతాండం అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా భారీ ప్రభావాన్ని చూపించిన ఈ మాయదారి రోగం కుటుంబాల ఆర్థిక పరిస్థితిని ఎంత దారుణంగా దిగజార్చిందన్న విషయం తాజాగా వెలువడిన ఒక సర్వే నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ సర్వేను జులైలో నిర్వహించారు. కరోనా కారణంగా యువ కుటుంబాల ఆర్థిక స్థితి దారుణంగా తయారైనట్లుగా పేర్కొన్నారు. ఎఫ్ఐఎస్ సర్వే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. తాము మొత్తం 2వేల మందితో అధ్యయనాన్ని నిర్వహించామని చెబుతున్నారు.
సర్వే చేసిన సంస్థ మర్చంట్ బ్యాంకులకు సాంకేతికత అందించటంతో పాటు టెక్నికల్ సొల్యూషన్స్ సేవల్ని అందిస్తుంటారు. సర్వేలో పాల్గొన్న వారిలో 70 శాతం మంది గడిచిన మూడు నెలల్లో ఉద్యోగ సంబంధిత సమస్యల్ని భారీగా ఎదుర్కొన్నట్లుగా చెబుతున్నారు. యువ కుటుంబాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లుగా తేలింది. సర్వేలో పాల్గొన్నవారిలో 55 శాతం మంది తాము మూడు నెలలకు మించి ఆర్థిక అవసరాల్ని తీర్చుకునే స్థితిలో లేమని చేతులెత్తేశారు.
కరోనా వేళ.. యువ కుటుంబాల వారితో పోలిస్తే వై కేటగిరి (29-39 ఏళ్ల మధ్య వయస్కులు) పరిస్థితి కాస్త బాగున్నట్లుగా తేల్చారు. 18 నుంచి 23 ఏళ్ల మధ్యనున్న వారిని జనరేషన్ జెడ్ గా అభివర్ణిస్తారు. అదే సమయంలో 24 నుంచి 28 ఏళ్ల మధ్య వయసున్న వారిని జెనరేషన్ వై యంగ్ గా చెబుతారు. ఇక.. 29 నుంచి 39 మద్య వారిని జనరేషన్ వై సీనియర్ గా పేర్కొంటారు.
ఇక.. 40 నుంచి 54 ఏళ్ల మధ్య వారిని జనరేషన్ ఎక్స్ గా.. 55 ఏళ్లకు పైబడిన వారిని వయసు మళ్లిన వారిగా వ్యవహరిస్తారు. ఈ లెక్కలో చూస్తే.. జనరేషన్ జెడ్ కేటగిరి వారు తమ ఆర్థిక అవసరాల్ని మూడు నెలలకు మించి భరించలేమని 55 శాతం మంది పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్న అన్ని కేటగిరిల వారిలో ఐదు శాతం మంది ఇప్పటికే తమ ఆర్థిక అవసరాల్ని తీర్చుకోలేని దుస్థితిలో ఉన్నట్లుగా వాపోయారు.