కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చి ఏడాది దాటిపోయింది. కానీ, కరోనా మహమ్మారి జోరు ఏ మాత్రం తగ్గినట్టు అనిపించడం లేదు. మధ్యలో కొన్ని దేశాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గినట్లే కనిపించినా కూడా , అక్కడ సెకండ్ వేవ్ మొదలై , అందరిలో మళ్లీ ఆందోళన పెంచేస్తుంది. ముఖ్యంగా యూరప్, అమెరికా దేశాల్లో ఈ కరోనా తీవ్రత పెరిగిపోతుంది. చలిగాలులు పెరగడంతో వైరస్ విజృంభిస్తోంది. ఇక ఇండియా లో కూడా ఈ మధ్య మళ్లీ కరోనా విజృంభణ పెరుగుతున్నట్టు రోజురోజుకి నమోదు అయ్యే కరోనా కేసుల్ని చూస్తే అర్థమౌతుంది.
ఇకపోతే , గత 24 గంటల్లో ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 5,70,993 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 8889 కరోనా మరణాలు సంభవించాయి. అమెరికాలో నిన్న ఒక్కరోజులో 1.60 లక్షల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగితోంది. అమెరికా ఎన్నికల తరువాత అక్కడ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవున్నాయి. ప్రతిరోజూ లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీనితో అమెరికా వాసులు మళ్లీ కరోనా దెబ్బకి వణికిపోతున్నారు. రెండో దశ కరోనా వైరస్ తో జాగ్రత్తగా ఉండాలని, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైరస్ అత్యంత ప్రమాదకారిగా మారే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక , ఇండియాలో నిన్న కొత్తగా 45,209 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 90,95,806కి చేరింది. అలాగే, నిన్న కరోనాతో 501 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,33,227కి చేరింది. ప్రస్తుతం ఇండియాలో మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. ఇండియాలో నిన్న కరోనా నుంచి 43,493 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 85,21,617కి చేరింది. ఇండియాలో రికవరీ రేటు 93.7 శాతంగా ఉంది. ప్రస్తుతం ఇండియాలో 4,40,962 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసులు ఉన్న దేశాలలో ఇండియా 7వ స్థానంలో ఉండటం షాకింగ్ అంశం. ఇండియా కంటే ముందు అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, బ్రెజిల్, రష్యా ఉన్నాయి. దీన్ని అరికట్టాలంటే ముందున్న ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే. ఆ వ్యాక్సిన్ వచ్చేవరకు కరోనా ను ఆపడం అసాధ్యమే అనిపిస్తుంది.