హైకోర్టు చెప్పినా.. మహమ్మారితో పలువురు చనిపోయినా కేసీఆర్ సర్కార్ మాత్రం మహమ్మారి టెస్టులు పెంచడం లేదు. అదే పక్కనున్న ఏపీలో రోజుకు 28వేల వరకు టెస్టులు చేస్తున్నారు. కానీ తెలంగాణ అసలు మహమ్మారి టెస్టులే మొన్నటివరకు చేయలేదు. చేయమని తేల్చిచెప్పారు. హైకోర్టు ఆదేశంతో మళ్లీ చేస్తున్నారు.
తెలంగాణలో ఇప్పుడు తక్కువ టెస్టులు చేస్తున్నారు. అయినా మహమ్మారి రాష్ట్రంలో విజృంభిస్తూనే ఉంది. రోజురోజుకి కేసులు పెరుగుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 4234 టెస్టులు చేయగా.. 1018 మందికి మహమ్మారి పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ లో వెల్లడించింది. ఇందులో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 881మంది కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లోనే రెండు వేల వరకు టెస్టులు చేశారు. అంటే సరాసరి చూస్తే హైదరాబాద్ లో ప్రతీ నలుగురిలో ఇద్దరికీ మహమ్మారి ఉన్నట్టు లెక్క.ఈ పరిణామం హైదరాబాద్ లో ఉండేవారిని కలవరపెడుతోంది.
తాజాగా కేసులతో తెలంగాణలో మహమ్మారి బాధితుల సంఖ్య 17357కి చేరింది. అలాగే నిన్న ఒక్కరోజులో ఏడడుగురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 267కి పెరిగింది. దీన్నిబట్టి హైదరాబాద్ లో మహమ్మారి తీవ్రంగా ఉన్నట్టు అర్థమవుతోంది. టెస్టుల్లో కేసుల్లో 90శాతం హైదరాబాద్ నుంచే ఉండడంతో ప్రతీ నలుగురిలో ఇద్దరికీ మహమ్మారి తేలుతుందని అర్థమవుతోంది.