కరోనాతో బాధపడుతున్న ఓ నిండుగర్భిణి పట్ల కార్పొరేట్ ఆస్పత్రి యాజమాన్యం నీచంగా ప్రవర్తించింది. ఆమె భర్తతో దాదాపు 29 లక్షలు ఫీజు వసూలు చేసిన యాజమాన్యం. ఐసీయూలో చికిత్స చేసినట్టు డ్రామానడిపి చివరకు మృతదేహం అప్పగించింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోనే చోటుచేసుకున్నది. మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం బల్సురుగొండకు చెందిన శ్వేతారెడ్డి.. ప్రస్తుతం హైదరాబాద్‌లో గ్రూప్2 అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె నిండు గర్భిణి కావడంతో మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి చూపించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమెకు జ్వరం వచ్చింది. అయితే ఆగస్టు 3న శ్వేతారెడ్డిని డెలివరీ కోసం మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెకు కరోనా లక్షణాలు ఉన్నందున కరోనా పరీక్షలు చేయించాలని వైద్యలు సూచించారు.
వైద్యుల సూచనమేరకు ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా నెగిటివ్ గా తేలింది. అయినప్పటికీ మహబూబ్‌నగర్‌లోని ఏ ఆస్పత్రి ఆమెను చేర్చుకోలేదు. దీంతో అగస్టు 4న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. రూ.2లక్షలు చెల్లిస్తేనే సిజేరియన్ చేస్తామని చెప్పడంతో భర్త మాధవరెడ్డి ఆ డబ్బును కట్టారు. అక్కడ శ్వేతారెడ్డి మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే డెలివరీ తర్వాత రెండు రోజులకు ఆమెకు కొద్దిగా అనారోగ్యంగా అనిపించడంతో ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేశారు. అపుడు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ కార్పొరేట్ దవాఖాన యాజమాన్యం ఆమెను ఐసీయూలోకి తరలించింది. అప్పటి నుంచి ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామంటూ.. దశల వారీగా 29 లక్షల ఫీజు వసూలు చేశారు. మాధవరెడ్డి ఎప్పుడు ఆరా తీసినా శ్వేతారెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పేవారు.
తన భార్యను చూపించాలని మాధవరెడ్డి బాగా ఒత్తిడి తేవడంతో.. ఒకరోజు పీపీఈ కిట్ ఇచ్చి ఐసీయూలోకి అనుమతించారు. అప్పటికే ఆమె ఆపస్మారక స్థితిలో ఉన్నది. మనుషులను గుర్తుపట్టడం లేదు. దీంతో తన భార్యను అప్పగించాలని తాను వేరే ఆస్పత్రికి తీసుకెళ్తానని మాధవరెడ్డి పట్టుబడ్డారు. తన భార్య వైద్యానికి సంబంధించిన మెడికల్ రిపోర్టులు ఇవ్వాలని నిలదీశాడు. రిపోర్టులు ఇచ్చేందుకు ఆస్పత్రి యాజమాన్యం తిరస్కరించింది. చివరకు గురువారం ఉదయం శ్వేతారెడ్డి చనిపోయిందని.. రూ. 2లక్షలు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఆస్పత్రి యాజమాన్యం చెప్పింది. దీంతో మాధవరెడ్డి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కార్పొరేట్ ఆస్పత్రి దురాగతాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ఫిర్యాదు చేస్తానని మాధవరెడ్డి చెప్పాడు.