కరోనా పేరు చెబితే చాలు ప్రజాప్రతినిధులు హడలిపోతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతో మంది నాయకులు కరోనా బారిన పడ్డారు. సీఎంలను కూడా వైరస్ వదల్లేదు. ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాధి బారిన పడి చికిత్స పొందారు. ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. తమిళనాడులో అయితే ఏకంగా చెట్టు కింద అసెంబ్లీ సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. పంజాబ్ అసెంబ్లీలో పలువురు మంత్రులు సహా 33 మంది ఎమ్మెల్యేలు కరోనా బారిన పడడంతో వారికి చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు 20 రోజుల పాటు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక జాగ్రత్తలతో సమావేశాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ సిబ్బంది, అక్కడ విధులు నిర్వహించే అధికారులు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్న ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా అసెంబ్లీకి రావద్దని స్పీకర్ సూచించారు. సమావేశాలకు హాజరయ్యే వారు తప్పని సరిగా టెస్ట్ చేయించుకుని నెగటివ్ వచ్చినట్లు రిపోర్టు చూపిస్తేనే అనుమతిస్తామని చెప్పారు. ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆక్సి మీటర్, మాస్కులు, శానిటైజర్ తో కూడిన కిట్లను అందజేస్తామని చెప్పారు.