కొత్త స్ట్రెయిన్ కరోనా నేపథ్యం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్టయ్యింది. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో కొత్త కరోనా కేసులు నమోదుకాలేదని.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ పేర్కొన్నది. అయితే ఇటీవల బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఇది కొత్త స్ట్రెయినా.. లేక పాత కరోనానా అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చినవారికి విధిగా పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇటీవల యూకే నుంచి వచ్చినవారందరి వివరాలు వైద్య ఆరోగ్యశాఖ సేకరిస్తున్నది. డిసెంబర్ 9 కి ముందు వచ్చిన వారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నారు.
మరోవైపు కొత్త స్ట్రెయిన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ కూడా అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి కొత్త స్ట్రెయిన్‌పై పది రాష్ట్రాల వైద్యశాఖ ముఖ్య కార్యదర్శులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించి.. జన్యు క్రమం తెలుసుకొనేందుకు హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించాలని అన్ని రాష్ట్రప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. డిసెంబర్ 9 తర్వాత బ్రిటన్ నుంచి తెలంగాణకు మొత్తం 1200 మంది వచ్చారు. వీరిలో గ్రేటర్హైదరాబాద్ తో పాటు, వివిధ జిల్లాలకు చెందిన వారు కూడా ఉన్నారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ వారిని గుర్తించి క్వారంటైన్‌కు పంపించనున్నది.
ఆయా జిల్లా కేంద్రాలతో పాటు.. గచ్చిబౌలిలోని టిమ్స్ లోనూ క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. బ్రిటన్ నుంచి వచ్చినవారు 040-24651119, ఫోన్ లేదా.. 91541 70960 నంబరుకు వాట్సాప్‌లో సంప్రదిస్తే వారికి టెస్టులు చేస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటిచింది. ఇటీవల బ్రిటన్ నుంచి వచ్చినవాళ్లు 21 రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉండాలని.. ప్రభుత్వం సూచిస్తుంది. లక్షణాలు ఉన్నా లేకున్నా కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలని.. హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.