అనుకున్నదే నిజమైంది. మొన్నటివరకు సందేహంగా ఉన్న బ్రిటన్ స్ట్రెయిన్ తెలంగాణలో గుర్తించారు. గడిచిన కొద్దిరోజులుగా బ్రిటన్ నుంచి వచ్చిన వారిని జల్లెడ వేస్తున్న అధికారులు.. వారిని గుర్తించి పరీక్షించటం తెలిసిందే. అందులో కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న వారికి చెందిన శాంపిళ్లను ప్రత్యేక పరీక్షల కోసం సీసీఎంబీకి పంపారు. దీనికి సంబంధించిన రిపోర్టును తాజాగా కేంద్రానికి అందజేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇటీవల బ్రిటన్ నుంచి నుంచి వారిలో ఒకరికి కొత్త స్ట్రెయిన్ ను గుర్తించారు. ఇటీవల యూకే నుంచి వరంగల్ కు తిరిగి వచ్చిన సదరు వ్యక్తిలో కొత్త స్ట్రెయిన్ ను గుర్తించారు.
ఆ వ్యక్తితో ప్రాథమికంగా కాంటాక్టు అయిన వారిలో సదరు వ్యక్తి తల్లి.. భార్య.. డ్రైవర్ ఉన్నట్లుగా తేలింది. వీరందరికి పరీక్షలు నిర్వహించగా..తల్లికి పాజిటివ్ గా తేలింది. అయితే.. ఆమెకు కొత్త స్ట్రెయిన్ సోకిందా? లేదా? అన్న విషయం తేల్లేదు. శాంపిల్ సేకరించి.. సీసీఎంబీకి పంపారు. ఇక.. కొత్త స్ట్రెయిన్ వచ్చిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొత్త స్ట్రెయిన్ కు గురైన వ్యక్తి వివరాల్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచింది.
కొత్త స్ట్రెయిన్ కేసుల వివరాల్ని కేంద్రమే ప్రకటిస్తుందని చెబుతున్నారు. కరోనా తొలినాళ్లలో కూడా.. రాష్ట్రాల్లో నమోదైన కేసుల వివరాల్ని కేంద్రమే ప్రకటించేది. తాజాగా.. అదే పద్దతిని అనుసరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. బ్రిటన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో సోమవారం మరో వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్లుగా తేలింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు చెందిన ఇతడికి.. ఇంటి వద్దే పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ గా తేలినప్పటికి.. కొత్త స్ట్రెయిన్ లక్షణాలు కనిపించలేదని చెబుతున్నారు.
యూకే నుంచి నేరుగా తెలంగాణకు వచ్చిన వారు..యూకే మీదుగా రాష్ట్రానికి చేరిన వారి వివరాల్ని అధికారులు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వచ్చిన వారు 1216 మందిగా తేల్చారు. ఇందులో 1060 మంది ఆచూకీని తేల్చారు. మరో ఆరుగురు విదేశాలకు తిరిగి వెళ్లిపోయారు. మిగిలిన వారిలో పలువురు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావటంతో ఆయా రాష్ట్రాలకు ఆ సమాచారాన్ని అందించారు. రాష్ట్రంలో ట్రేస్ అయిన వారిలో 996 మందికి కొత్త తరహా స్ట్రెయిన్ కు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. వారిలో 966మందికి నెగిటివ్ రాగా.. 21 మందికి పాజిటివ్ వచ్చింది. మరో తొమ్మిది మంది ఫలితాలు రావాల్సి ఉంది.
పాజిటివ్ గా తేలిన వారిలో 21 మంది హైదరాబాద్ కు చెందిన వారు నలుగురు.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన వారు తొమ్మిది మంది..జగిత్యాల జిల్లాకు చెందిన వారు ఇద్దరు.. మంచిర్యాల.. నల్గొండ.. రంగారెడ్డి.. సంగారెడ్డి.. సిద్దిపేత.. వరంగల్ అర్బన్ జిల్లాలకు చెందిన వారు ఒక్కొక్కరుగా తేల్చారు. ముందస్తుజాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆదివారం శాంపిళ్లు సేకరించి.. పరీక్షలు జరిపిన వారిలో 205 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. మహమ్మారి కారణంగా ఇద్దరు మరణించారు. కొత్త స్ట్రెయిన్ బూచి తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బీకేర్ ఫుల్.