సెకండ్ వేవ్ వేళ బ్రిటన్ లో అమలు చేస్తున్న మూడంచెల విధానం ఏమిటి?

Update: 2020-11-24 07:00 GMT
తగ్గినట్లే తగ్గి.. మళ్లీ విరుచుకుపడుతున్న కరోనా సెకండ్ వేవ్ ధాటికి పలు దేశాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. సెకండ్ వేవ్ కు బాగా ప్రభావితమైన దేశాల్లో అమెరికా.. బ్రిటన్ తో పాటు పలు యూరోపియన్ దేశాలు ఉన్నాయి. ఇలాంటివేళ.. కరోనా విసిరిన తాజా సవాలును బ్రిటన్ సరికొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. మూడంచెల పేరుతో అమలు చేస్తున్న ఈ కొత్త విధానానికి రూపకర్త ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్.

అంతేకాదు.. ప్రస్తుతం ఆ దేశంలో లాక్ డౌన్ విధించారు. డిసెంబరు 2 తర్వాత నుంచి మూడంచెల విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. తాజాగా తీసుకొచ్చిన కొత్త ప్లాన్ వచ్చే ఏడాది మార్చి వరకు ఉంటుందని చెబుతున్నారు. ఈ విధానంలో ఎక్కువ రిస్కు.. తక్కువ రిస్కుతో పాటు మధ్యస్త రిస్కు ఉన్న ప్రాంతాల్ని గుర్తించి.. అందుకు తగ్గట్లు నిబంధనల్ని విధిస్తారు.

టైర్ 1..2 నిబంధనల్ని అమలు చేసే చోట్ల ఇతర వ్యక్తుల్నికలిసేందుకు అనుమతులు ఇస్తారు. ఆ ప్రాంతాల్లో పబ్ లు.. రెస్టారెంట్లు తెరిచి ఉంచుతారు. రాత్రి 11 గంటల వరకు ఓపెన్ గానే ఉంటాయి. లిమిటెడ్ గా స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంటుంది. ఇక.. టైర్ 3 ప్రాంతాల్లో మాత్రం.. ఇతర వ్యక్తుల్ని కలిసేందుకు అనుమతులు ఉండవు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి లభిస్తుంది. అంతేకాదు.. రెస్టారెంట్లు కేవలం టేక్ అవే సదుపాయాన్ని మాత్రమే కల్పిస్తాయి తప్పించి.. డైనింగ్ సౌకర్యం ఉండదు. అంతేకాదు.. పబ్ లతో పాటు.. జిమ్ లు.. ఇతరాలు ఏమీ అందుబాటులో ఉండవు. ప్రతి పద్నాలుగు రోజులకు ఒకసారి ఆయా ప్రాంతాల్లో కరోనా తీవ్రత ఎంత ఉందన్న విషయాన్ని సమీక్షించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. మొత్తానికి వ్యాక్సిన్ సంగతి ఎలా ఉన్నా.. కరోనా ముప్పు మార్చి వరకైతే తప్పదన్న సందేశాన్ని ఆ దేశం తీసుకుంటున్న చర్యల్ని చూస్తే.. అర్థం కాక మానదు.
Tags:    

Similar News