కరోనా భయం మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తోంది. దగ్గినా.. తుమ్మినా భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ టైంలో ఏదైనా ఇతర రోగం వస్తే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వైద్యులెవరు చికిత్సనందించడం లేదు. కరోనా భయంతో ఇప్పుడు అందరినీ అనుమానంగా చూస్తున్న దుస్థితి దాపురించింది.
తాజాగా కరోనా భయంతోనే రోడ్డుపైనే మృతదేహం ఉన్నా పట్టించుకోని దైన్యం నెలకొంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది.
సత్తెనపల్లిలో ఆస్పత్రికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఆయాసంతో కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటికే మృతిచెందాడు.
అయితే కరోనా భయంతో కుటుంబ సభ్యులతోపాటు ఎవరూ ఆ మృతదేహం వద్దకు వెళ్లలేదు. 5 గంటల పాటు డెడ్ బాడీ రోడ్డుపైనే ఉండిపోయింది. చివరకు మున్సిపల్ సిబ్బంది మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించారు. కాగా ఈ ఉదయం అతడికి కరోనా పాజిటివ్ వచ్చిందని వలంటీర్ తెలిపారు.