నిర్భయ దోషులకు ఉరి ఖరారు చేసిన సుప్రీం !

Update: 2019-12-18 08:34 GMT
నిర్భయ హత్యాచారం కేసులో దోషి అక్షయ్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. దోషికి ఉరి శిక్షపై సమీక్ష కోరే హక్కులేదని - అతడి పిటిషన్‌ ను త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది. అలాగే  త్వరలో నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించనున్నట్టు స్పష్టం చేసింది. దోషులపై ఎలాంటి దయ అక్కర్లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌ ను జస్టిస్ ఆర్. భానుమతి - అశోక్ భూషణ్ - బొపన్నలతో కూడిన బెంచ్ విచారించింది. కాగా, సుప్రీం తీర్పు పై దోషి తరఫున లాయర్ స్పందిస్తూ సుప్రీం కోర్టు లో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు.

ఇకపోతే ఈ సమయంలో సుప్రీం 2017లో పటియాలా కోర్టు ఇచ్చిన తీర్పు సరి అయినదేనని కోర్టు తెలిపింది. మధ్యాహ్నం 2 గంటలకు పటియాలా హౌస్ కోర్టులో నిర్భయ కేసుపై విచారణ జరగనుంది. ఇప్పటికే నిర్బయ తల్లిదండ్రులు పటియాలా కోర్టు ఆవరణకు చేరుకున్నారు. ఆ విచారణలో వీరికి డెత్ వారెంట్లు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే త్వరలోనే నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలుకానుంది. ఈ కేసులో మిగతా ముగ్గురు దోషులు రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా.. 2018 జులై 9న సర్వోన్నత న్యాయస్థానం వాటిని తిరస్కరించిన విషయం తెలిసిందే.


Tags:    

Similar News