దివంగత అమ్మ మేనకోడలు దీప సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మను హత్య చేసేందుకు తన సోదరుడు ప్రయత్నం చేశారంటూ కలకలం రేపే మాటలు చెప్పారు. తన సోదరుడు దీపక్.. శశికళ కుటుంబంతో కుమ్మక్కు అయినట్లుగా ఆరోపించిన ఆమె.. దీపక్‌ను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలన్నారు.
ఈ రోజు ఉదయం పోయెస్ గార్డెన్‌కు హటాత్తుగా వచ్చిన దీప.. అమ్మ ఇంట్లోకి తాను వెళతానని చెప్పి.. వెళ్లే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో దీపక్ అనుచరులు పలువురు దీపను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే.. దీప విషయం గురించి తెలుసుకున్న పోలీసులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోయెస్ గార్డెన్ లోకి వెళ్లనివ్వలేదు. ఈ సందర్భంగా పోలీసుల తీరును దీప తీవ్రంగా తప్పు పట్టారు.
ఈ సందర్భంగా దీప మీడియాతో మాట్లాడుతూ. . సంచలన వ్యాఖ్యలు చేశారు. పోయెస్ గార్డెన్ లో అమ్మ జయలలిత ఫోటోకి పూలమాల వేసి నివాళులు అర్పించే సమయంలో శశికళ కుటుంబ సభ్యులు కలిసి దీపక్ తనపై దాడికి పాల్పడ్డారన్నారు.
అమ్మ నివాసం స్వాధీనానికి చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటానని చెప్పిన ఆమె.. శశికళ ఫ్యామిలీ నుంచి అన్నాడీఎంకేను కాపాడాలన్నారు. తాను అమ్మ వారసురాలినని.. ఆమె ఆస్తులన్నీ తమకే దక్కుతాయన్నారు. ఇదిలాఉంటే.. ప్రస్తుతానికి పోయెస్ గార్డెన్ లోని వేద నిలయం ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఏమైనా.. సొంత సోదరుడిపై దీప చేసిన హత్య ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/