ఆర్మీ అధికారుల‌తో సినిమా చూసిన నిర్మ‌లాజీ!

Update: 2019-01-28 05:17 GMT
పెద్ద హ‌డావుడి లేకుండా.. త‌క్కువ స్క్రీన్ల‌తో విడుద‌లైన హిందీ మూవీ ఊరి. ఈ సినిమా మీద పెద్ద‌గా బ‌జ్ లేదు కానీ.. విడుద‌లైన నాటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ సినిమా టికెట్లు తేలిగ్గా దొర‌క‌ని ప‌రిస్థితి. త‌క్కువ స్క్రీన్ల‌లో ఈ సినిమాను ప్ర‌ద‌ర్శించ‌టం.. క‌మ‌ర్షియ‌ల్ హంగులు లేని ఈ సినిమా మౌత్ టాక్ తో స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది.

విక్కీ కౌశ‌ల్.. యామినీ గౌతం త‌దిత‌ర న‌టుల‌తో రూపొందించిన ఈ సినిమా.. సంచ‌ల‌నం సృష్టించిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ నేప‌థ్యంలో తీసిన మూవీ. దేశ‌భ‌క్తిని ర‌గిలించే ఈ మూవీ విడుద‌లైన నాటి నుంచి ఇప్ప‌టికి స‌క్సెస్ ఫుల్ గా న‌డుస్తోంది. తాజాగా ఈ సినిమాను కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బెంగ‌ళూరులోని ఒక మాల్ లో చూడ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

తాజాగా ఆమె.. ర‌క్ష‌ణ శాఖ అధికారులు.. మాజీ అధికారుల‌తో పాటు.. అమ‌ర‌వీరులైన సైనిక కుటుంబాల‌తో క‌లిసి బెంగ‌ళూరులోని పీవీఆర్ సెంట్ర‌ల్ స్పిరిట్ మాల్ లో చూశారు. ఈ సంద‌ర్భంగా సైనిక కుటుంబాల‌తో ఆమె సెల్ఫీలు దిగారు. సినిమా చూసిన వెంట‌నే త‌న స్పంద‌న‌ను సోష‌ల్ మీడియాలో ట్వీట్ రూపంలో తెలియ‌జేశారు. భార‌త‌మాతాకీ జై.. వందేమాత‌రం.. ఎలా ఉంది జోష్ ? అంటూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.
Tags:    

Similar News