మోదీ కలను నెరవేరుస్తున్న ఇతర పార్టీలు

Update: 2020-02-12 06:30 GMT
శతాబ్దంన్నర సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ.. 60 ఏళ్ల పాటు దేశాన్ని ఏలిన పార్టీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. ఏడేళ్లల్లో పరిస్థితులు అన్నీ మారిపోయాయి. ఒకప్పుడు దేశాన్ని ఏలిన పార్టీ ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని పొందలేకపోతున్నది. ఇక ఎంపీ స్థానం అంటే ఊహించకూడనిది. తాజాగా ఢిల్లీ ఫలితాలను చూస్తుంటే అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యర్థులకు కనీస పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితికి హస్తం పార్టీ చేరింది. అయితే నరేంద్ర మోదీ 2014 ఎన్నికల సమయంలో ఏ లక్ష్యంతో వచ్చారో అది ఇప్పుడు సాకారమవుతోంది. కాంగ్రెస్ రహిత దేశంగా.. కాంగ్రెస్ కు హఠావో.. దేశ్ బచావో అనే నినాదాన్ని ఆయన కొంత సాధించగా మిగతా పనిని కొన్ని పార్టీలు చేస్తూ కాంగ్రెస్ ను నామరూపాల్లేకుండా చేస్తున్నాయి.

2014 ఎన్నికల సమయంలో ప్రధానంగా నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపైన విరుచుకుపడ్డాడు. అవినీతి కాంగ్రెస్ ను దేశంలో నామరూపాల్లేకుండా చేద్దామని పిలుపునిచ్చాడు. అయితే ఆ మేరకు కొంత సఫలీకృతుడయ్యాడు. అప్పుడు జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చావుదెబ్బ కొట్టాడు. ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా మోదీ చేశాడు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు నరేంద్ర మోదీ చుక్కలు చూపించాడు. అయితే ఆ బాధ్యతలను వేరే పార్టీలు తీసుకున్నాయని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం కొన్ని రాష్ట్రాల్లో పాలిస్తుండేది. దీంతో మోదీ అనుకున్న లక్ష్యం నెరవేరలేదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటును దక్కించుకోలేదు. వైఎస్సార్సీపీ అధికార టీడీపీతో పాటు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా దెబ్బతీశాడు. అద్భుత మెజార్టీ సీట్లు సాధించి కాంగ్రెస్ పార్టీ పక్కన పారేశాడు. అంతకుముందు 2014 ఎన్నికల్లోనూ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే సీటు దక్కలేదు. ఇప్పుడు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కు ఒక్క సీటు రాలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బకు హస్తం కకావికలమైంది.

2015 ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి కాంగ్రెస్ కు ఎదురైంది. ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ ను నామారూపాల్లేకుండా చేశాడు. చూస్తే జాలేస్తోంది. దేశ రాజధాని ఉన్న రాష్ట్రానికి ఎన్నికలు జరిగితే వారు కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించ లేకపోయారు. ఇటు తెలంగాణలోనూ కాంగ్రెస్ కు ఆశించిన ఫలితాలు రావడం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర ఫలితాలు పొందింది. ఇక్కడ కేసీఆర్ కాంగ్రెస్ ను ఎదగకుండా చేస్తున్నాడు. దీంతో కాంగ్రెస్ రహిత దేశం మోదీ కల కాగా దాన్ని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కొంత తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్నారు.
Tags:    

Similar News